Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP ధాన్య సేకరణలో ప్రభుత్వం విధానం సరిలేదు | AP Govt Job information

ఆంధ్రప్రదేశ్ లో ధాన్య సేకరణ జరుగుతుంది అని, ఈ ధాన్య సేకరణలో ప్రభుత్వనికి చెడ్డపేరు తప్పదు అని ఎప్పుడో మన యొక్క telugucompetitive వెబ్‌సైట్ లో ప్రచురించడం జరిగింది. అయితే ఈ రోజు వార్త పత్రికలలో కూడ కధనాలు వెలువడినవి.


గతంలో ప్రభుత్వం ధాన్య సేకరణలో ఇబ్బంది కలుగకుండా పౌరసరఫరాల సంస్థనుంచి ప్రతి RSK కి ఒక TA మరియు ఒక DEO మరియు ఒక హెల్పర్ ని నియమించడం జరిగింది. తరువాత వచ్చిన ఈ 20 లక్షల ఉద్యోగాల ప్రభుత్వం కనీసం వారి యొక్క కాంట్రాక్ట్ పిరియడ్ ని రెన్యువల్ కూడ చెయ్యకుండా బయట వ్యక్తులతో ధాన్య సేకరణ చేపిస్తుంది. 

మళ్ళీ ప్రతి RSK కి ముగ్గురు చప్పున సిబ్బంది ఉన్నట్లు దొంగ లెక్కలు మాత్రం చూపిస్తారు. వారిని ఏ ప్రతిపదికన తీసుకున్నారో ఆ తిరుపతి వెంకన్నకే తెలియాలి. 

రోస్టర్ ప్రతి పతిపదికన మెరిట్ ఆధారంగా డిస్క్ట్రిక్ సెలక్షన్ కమిటి ద్వారా నియమించబడిన సిబ్బందిని ఇంతాలా ఇబ్బంది పెట్టడం ప్రభుత్వనికి ఏమాత్రం సరికాదు. 

RSK లో పని చేస్తున్న సిబ్బంది మా యొక్క కాలపరిమితి రెన్యువల్ చెయ్యాలి అని లోకేష్ గారి దగ్గరకి వెళ్ళి కలవడం జరిగింది. కాని ఇప్పటి వరకు ఏ విధన స్పదన లేదు. 

తేమశాతం చూడడం, రైతులలో తేమశాతం పట్ల అవగహాన తెప్పించడం టెక్నికల్ అసిస్టెంట్ ల యొక్క పని. మరియు ధాన్య యొక్క నాణ్యతను పరిక్షించి వెబ్‌సైట్ లో నమోదు చెయ్యడం టెక్నికల్ అసిస్టెంట్ ల యొక్క పని. కాని ఆ యొక్క వెబ్‌సైట్ లాగిన్ ఐడిలు ఇప్పుడు బయట వ్యక్తుల దగ్గర ఉన్నయి. ఇది ఈ ప్రభుత్వనికి న్యాయమా 

మొత్తం బాధ్యతలు సొసైటిలకు అప్పచెప్పి ధాన్య సేకరణలో ప్రభుత్వం యొక్క పాత్రం కనీసం 10%  కూడ లేదు. సిబ్బందిని నియమించడం కూడ పుర్తిగా సొసైటిల ఇష్టమే తప్ప ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిలేదు. 

గత ప్రభుత్వలో సిబ్బందికి అన్యాయం :

గతంలో RSK లో పని చేస్తున్న సిబ్బంది కాల పరిమితి 11 నెలలు అని చెప్పిన ప్రభుత్వం తరువత వారి యొక్క కాలపరితిని 2 లేదా 3 నెలలకు పరిమితం చేసి అన్యాయం చేసింది. రిక్యూర్ట్‌మెంట్ గైడ్‌లైన్స్ లో ఉన్న కాల పరిమితికి నోటిఫికేషన్ లో ఉన్న కాల పరిమితికి సంబందం లేకుండా పోయింది. 

Post a Comment

0 Comments