Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Groups Preparation Telugu 2020 History Special | అష్ట దిగ్గజకవులు ఎవరెవరు???

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరీక్షలలో "భారతదేశ  చరిత్ర" అతిముఖ్యమైన అంశం అని మనందరికీ తెలుసు. అయితే మారుతున్న పరీక్షల ప్రశ్నవళి శ్రేణిలో భారత దేశాన్ని పాలించిన రాజులు,, వారి రాజ్యంలో ఉన్న ముఖ్య అంశాలపైనా మనం ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. Groups Preparation Telugu 2020 History Special


పలు పోటీపరీక్షలలో భారత దేశ రాజులు - వారు పరిపాలించిన రాజ్యంలో ఉన్న ప్రముఖ కవులు,, వారి రచనలు గురించి తరచుగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో అతిముఖ్యమైన "అష్టదిగ్గజ కవులు" ,, "వారి రచనలు",, "అష్టదిగ్గజాలు ఎవరి ఆస్థానంలో కవులు " మొదలైన అతిముఖ్య అంశాలను నేటి మీ "TELUGU COMPETITIVE" అందిస్తుంది. పదండి చదువుకుందాం.. మార్కులు సంపాదించుకుందాం.

విజయనగర సామ్రాజ్యాన్ని అజేయముగా ఏలిన చక్రవర్తి  " శ్రీ  కృష్ణ దేవరాయులు ". శ్రీ కృష్ణ దేవరాయలు వారికాలంలో సంగీతాది రచనలకు,, కవిత్వాలకు,, అందునా ప్రత్యేకంగా కవులకు పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగానే రాయలవారు తమ విజయనగర ఆస్థానంలో ఎనిమిది మంది కవులను నియమించుకున్నారు. అనగా అష్టదిగ్గజాలు అనేవారు "శ్రీ కృష్ణ దేవరాయులవారి ఆస్థాన కవులు "..

అల్లసాని పెద్దన,, నంది తిమ్మన,, మాదయ్య గారి మల్లన,, దూర్జటి,, అయ్యలరాజు రామభద్రుడు,, పింగళి సూరన రాఘవ,, రామరాజు భూషణుడు (బట్టు మూర్తి ),, తెనాలి రామకృష్ణ (వికటకవి ) అనే ఎనిమిది మంది కవులు విజయనగర సామ్రాజ్య ఆస్థానంలో శ్రీ కృష్ణ దేవరాయలవారి కాలంలో ఉండేవారు.

అష్టదిగ్గజాలు  - వారి రచనలు ::



  1. అల్లసాని పెద్దన :  మను చరిత్ర  (స్వారోచిష మనుసంభవం),, హరికథాసారం,, రామస్తవరాజం.

  2. నంది తిమ్మన  :   పారిజాతాపహరణం

  3. మాదయ్యగారి మల్లన : రాజశేఖర చరిత్ర.

  4. దూర్జటి   : శ్రీ కాళహస్తీశ్వర శతకం,, కాళహస్తీశ్వర మహత్యం.

  5. అయ్యలరాజు రామభద్రుడు : రామాభ్యుదయం.

  6. పింగళి సూరన రాఘవ : పాండవీయం.

  7. రామరాజ భూషణుడు : వసుచరిత్ర,,                                                                               హరిశ్చంద్రోపాఖ్యానం.

  8. తెనాలి రామకృష్ణ : పాండురంగ మహత్యం,ఘటికాచల మహత్యం,ఉద్బటారాధ్య చరిత్ర.                      తెనాలి రామకృష్ణునికి "వికటకవి "అనే బిరుదు గలదు.  

Post a Comment

0 Comments