Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP DSC పరీక్షకు 3 నెలల టైమ్ పట్టే అవకాశం | AP DSC Latest News 2024

ఆంధ్రప్రదేశ్ ల DSC నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అనేక వివాదలు తలెత్తడం జరిగింది. మొదట SGT పోస్ట్ లకు B.Ed వారు అర్హులు అన్నప్పటి నుంచి చాలా గొడవలు అవ్వడం జరిగింది. 

తరువాత కోర్టు బిఎడ్ వారు అర్హులు కాదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. రెండో విషయం TET పరీక్ష నిర్వహించిన వెంటనే డీఎస్సీ నిర్వహిస్తున్నారని చాలామంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం జరిగింది. దాని తర్వాత కోర్టు TET మరియు డీఎస్సీకి మధ్య సమయం కనీసం నాలుగు వారాలు ఉండాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి అని చెప్పి అధికారిక వెబ్సైట్లో షెడ్యూల్ విడుదల చెయ్యడం జరిగింది.

అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ అమలులోనికి రావడం జరిగింది. అయితే డీఎస్సీకి అప్లై చేసిన వారిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు అంటే తక్కువ స్థాయి ఉద్యోగులు కూడా ఈ యొక్క డీఎస్సీకి అప్లై చేయడం జరిగింది. అప్పుడు ఈ యొక్క ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ అదేవిధంగా పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి పరీక్షలకు ఏ విధంగా హాజరు కావాలి అనేటటువంటి ఆలోచన రావడం జరిగింది. ఇటువంటి ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో మేము పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి అని కూడా చాలామంది విద్యార్థుల్లో ఒక సమస్య నెలకొంది.  

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో డీఎస్సీ నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. అయితే TET సంబంధించినటువంటి ఫలితాల విడుదలకు కూడా ఈసీ యొక్క పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది.

ఈ సమయంలో చాలామంది విద్యార్థులు ఈసీని రిక్వస్ట్ చేయడం జరిగింది వేల సంఖ్యలో మెయిల్స్ వందల సంఖ్యలో ఫోన్లో ఈసీకి చేసి ఈ యొక్క డీఎస్సీ పరీక్ష వాయిదా వేయవలసిందిగా కోరడమైనది. విద్యార్థుల యొక్క అర్జీలను పరిగణలోకి తీసుకున్నటువంటి ఈసీ రెండు రోజుల్లో దీనిమీద తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తామని చెప్పి విద్యార్థులకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డీఎస్సీ యొక్క నిర్వహణ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది.

అయితే డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని చెప్పి కొంతమంది ఎమ్మెల్సీలు కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా ఈసీకి రిక్వెస్ట్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ వల్ల డీఎస్సీ పరీక్షలు వాయిదా పడితే మే 13 వరకు పరీక్షలు జరగవు అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే, అయితే ఎన్నికల ఫలితాలు ప్రకటించడం. ప్రమాణ స్వీకరాలు అనేక రకాలైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ చిన్న చిన్న పనులు అన్నీ కూడా పూర్తి కావాలి ఇలా పూర్తయిన తరువాత DSC పరీక్ష జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు నెలలు వరకు కూడా డీఎస్సీ పరీక్ష నిర్వహించడానికి టైం పట్టేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

EC నుంచి స్పష్టత లేదు కాబట్టి ఏమి జరుగుతుందో చూడలి. అభ్యర్థులు ఈ యొక్క అవకాశం వినియోగించుకొని బాగ ప్రిపేర్ అవ్వండి. 

Post a Comment

0 Comments