Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Sources of Indian Constitution 2020 | భారత రాజ్యాంగంపై ఇతర దేశపు రాజ్యాంగాల ప్రభావం

రాబోయే రోజుల్లో 2020 సంవత్సర ఆరంభం నుంచి  ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి గ్రూప్ -1,, 2,, 3,, 4..టెట్ మరియు DSC,, సచివాలయం మొదలగు నోటిఫికేషన్స్ రానున్న కీలక తరుణంలో మీకోసం,, మీ పరీక్షల ప్రిపరేషన్ కోసం TELUGUCOMPETITIVE.COM ఎల్లపుడూ మీ వెన్నంటే ఉంటుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి జరిగే ప్రతీ పరీక్షలలోను "భారత దేశ రాజ్యాంగం " అనే టాపిక్ పై తరచుగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కావున రాజ్యాంగం లో మీకు  ఒకటి లేదా రెండు మార్కులు తెచ్చిపెట్టే ముఖ్య అంశం "భారత రాజ్యాంగం పై ఇతర రాజ్యాంగాల ప్రభావం " గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారత దేశ రాజ్యాంగంపై బ్రిటన్,, అమెరికా,, కెనడా,, ఐర్లాండ్,, దక్షిణాఫ్రికా,, ఆస్ట్రేలియా,, ఫ్రాన్స్,, రష్యా,, జపాన్,, జర్మనీ దేశాల రాజ్యాంగం ప్రభావం ఉంది. ఆయాదేశాలలో ముఖ్యమైన అంశాలను భారతదేశ రాజ్యంగంలో పొందుపరిచారు. ఇప్పుడు ఏ దేశ రాజ్యాంగం నుంచి ఏఏ అంశాలను భారతదేశ రాజ్యంగంలో పొందుపరిచారో  తెలుసుకుందాం రండీ. Sources of Indian Constitution 2020

1). బ్రిటన్  :

పార్లమెంటరీ ప్రభుత్వం,, స్పీకర్ వ్యవస్థ,, శాసన  ప్రక్రియ,, పార్లమెంటరీ కమిటీలు,, ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ,, సమన్యాయ పాలన, అఖిల భారత సర్వీసులు,అటార్నీ జనరల్, కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (కాగ్ ), ఎన్నికల విధానం, ద్విసభా విధానం.. అనే అంశాలను బ్రిటన్ దేశంనుండి తీసుకుని మన భారత  రాజ్యంగంలో పొందుపరచడం జరిగింది.

2). అమెరికా :

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రవేశిక, ఉపరాష్ట్రపతి వ్యవస్థ,, ప్రాథమిక హక్కులు, స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ,,న్యాయ  సమీక్ష,, చట్టంలో సమదృష్టి, మహాభియోగ తీర్మానం        మొదలైనటువంటి అంశాలను అమెరికా నుండి  గ్రహించి మన భారత దేశ రాజ్యంగంలో పొందుపరిచారు. 

3).కెనడా  :

సమాఖ్య ప్రభుత్వం,, అవశిష్టా అధికారాలు,,గవర్నర్ వ్యవస్థ,, రాష్ట్రపతి సుప్రీమ్ కోర్ట్  సలహాలు కోరే విధానం మొదలైనటువంటి  అంశాలనుకెనడా దేశం నుండి తీసుకుని భారత         రాజ్యంగంలో పొందుపరిచారు.     

4).ఐర్లాండ్  :

ఆదేశిక సూత్రాలు,, రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతి  రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేసే విధానం మొదలైన అంశాలను ఐర్లాండ్ దేశం గ్రహించి నుంచి భారత దేశం రాజ్యాంగం లో  పొందుపరిచారు. 

5).దక్షిణాఫ్రికా :


రాజ్యాంగ సవరణ,, రాజ్యసభ సభ్యుల ఎన్నిక  విధానం మొదలైనటువంటి అంశాలను        భారతదేశ రాజ్యాంగం కొరకు దక్షిణాఫ్రికా దేశం  నుండి గ్రహించారు. 

6). ఆస్ట్రేలియా ::

ఉమ్మడి జాబితా, పార్లమెంట్ ఉమ్మడి సభ సమావేశం,, కేంద్ర రాష్ట్రాల మధ్య  సంబంధాలు,,వర్తక వాణిజ్య చట్టాలు అనే  అంశాలను ఆస్ట్రేలియా దేశం నుండి గ్రహించి  మన భారతదేశ రాజ్యంగంలో పొందుపరిచారు.

7).ఫ్రాన్స్   :

గణతంత్ర,, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, తాత్కాలిక స్పీకర్ అనే అంశాలను భారత దేశ రాజ్యాంగం కొరకు ఫ్రాన్స్ దేశం నుండి గ్రహించారు.  

8). రష్యా :

ప్రాథమిక విధులు,, సౌమ్యవాదం,, న్యాయం,, ప్రణాళికలు అనే అంశాలను మన భారతదేశ  రాజ్యంగంలో పొందుపరచడానికి రష్యా దేశం నుండి  గ్రహించారు. 

9). జపాన్ :

జీవించే హక్కు అనే అంశాన్ని జపాన్ దేశం నుండి మన భారత దేశ రాజ్యాంగం కొరకు గ్రహించారు. 

10).జర్మనీ :

అత్యవసర పరిస్థితి అనే అంశాన్ని మన భారత దేశ రాజ్యాంగం  కొరకు జర్మనీ దేశం నుండి         గ్రహించారు. 

మీ పరీక్షల ప్రిపరేషన్ ప్రణాళికలో " TELUGU COMPETITIVE" ఎల్లపుడు మీకు తోడుంటుందని చెపుతూ,  

Post a Comment

0 Comments