రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు -2020 పరీక్షలు డిసెంబర్ -15 వ తారీఖు నుండి జరుగుతున్నాయనే విషయం అభ్యర్థులందరికీ విదితమే.ఈ సందర్భంలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ మారిన పరీక్ష విధానం లో మార్పులను గమనిస్తూ ప్రిపరేషన్ ను కొనసాగించవలసి ఉన్నది అనేది సుస్పష్టమైన విషయం.
ఇందులో భాగంగానే రాబోయే రైల్వే బోర్డు పరీక్షలలో అడగడానికి వీలుండే ముఖ్యమైన ప్రశ్నలను సబ్జెక్టుల వారీగా కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్,జనరల్ అవేర్నెస్, మాథ్స్, మెంటల్ ఎబిలిటీ & రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను అందజేస్తున్నాము. కావున అభ్యర్థులందరూ ఈ ముఖ్యమైన బిట్స్ ను మీ ప్రిపరేషన్ లో చేర్చుకుని బాగా ప్రిపేర్ అవ్వి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాము.
1) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ -2019 ర్యాంకు లలో మొదటి రెండు స్థానాలు కైవసం చేసుకున్న భారతదేశ రాష్ట్రాలు?
A). ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్.B).ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్
C). ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
D). ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్.
సమాధానం : " A " ( ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ).
2) సెప్టెంబర్ 4, 5 తేదీల్లో బంగాళాఖాతంలో జరిగిన "ఇంద్ర నేవి - 2020" విన్యాసాలు ఏయే దేశాల మధ్య జరిగాయి?
A). భారత్ -రష్యా
B). భారత్ - అమెరికా
C). భారత్ - చైనా
D) భారత్ - శ్రీలంక.
సమాధానం : " A " ( భారత్ - రష్యా ).
3) మిషన్ కర్మయోగి ఏ ఉద్యోగాలకు సంబంధించిన కార్యక్రమం?
A).ఉపాధ్యాయ ఉద్యోగాలు
B).సివిల్ సర్వీస్ ఉద్యోగాలు
C).సైనిక ఉద్యోగాలు
D). పైవేవీ కావు.
సమాధానం : " B " ( సివిల్ సర్వీస్ ఉద్యోగాలు ).
4) మానసిక సంబంధ రుగ్మతలతో బాధపడేవారికి సహాయం అందించడానికి ఇటీవల భారత కేంద్ర ప్రభుత్వం "కిరణ్" పేరుతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. అయితే కిరణ్ టోల్ ఫ్రీ నెంబర్ క్రింది వానిలో ఏది?
A).1800-599-0016
B).1800-599-0017
C). 1800-599-0018
D).1800-599-0019
సమాధానం : " D " ( 1800-599-0019 ).
5) ప్రపంచంలోనే అతిపెద్ద సౌర వృక్షాన్ని అభివృద్ధి చేసిన దేశం?
A). భారత్
B). చైనా
C). అమెరికా
D). ఇంగ్లాండ్
సమాధానం : " A " ( భారత్ ).
6) ఆర్థిక స్వేచ్చా సూచి -2020 లో భారత్ కు లభించిన స్థానం?
A). 105 వ స్థానం
B). 106వ స్థానం
C). 107వ స్థానం
D). 108వ స్థానం.
సమాధానం : "A"( 105వ స్థానం ).
7) భారత కేంద్ర ఎన్నికల కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించినవారు ఎవరు?
A).రాజీవ్ కుమార్
B). పార్థసారధి
C).హర్ సిమ్రత్ కౌర్
D).గోపాలకృష్ణ
సమాధనం కామెంట్ రాయండి
8) భారతదేశంలో తొలి కార్గో ఎక్స్ ప్రెస్ రైలును ఏ రైల్వే జోన్ లో ప్రారంభించారు?
A). దక్షిణ మధ్య రైల్వే
B). ఉత్తర రైల్వే
C). ఈశాన్య రైల్వే
D). ఆగ్నేయ రైల్వే
సమాధానం : " A " ( దక్షిణ మధ్య రైల్వే ).
9 ) మేఘాలయ గవర్నర్ గా ఇటీవల నియమితులైనది?
A) సత్యపాల్ మాలిక్
B)మనోజ్ సిన్హా
C). ప్రదీప్ కుమార్ జోషి
D). రాకేష్ ఆస్తానా
సమాధానం :" A " ( సత్యపాల్ మాలిక్ ).
10) అంతరిక్షంలో సుదీర్ఘ కాలం 328 రోజులు గడిపిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన వారు?
A). క్రిస్టినా కోచ్
B).పెగ్గీ వాట్సన్
C).జెస్సికా మేయర్
D).పర్మిటానో
సమాధానం : " A " ( క్రిస్టినా కోచ్ ).
11) విద్యుత్ ప్రవాహ తీవ్రతకు ప్రమాణం?
A).ఓమ్
B).వాట్
C).ఆంపియర్
D).ఏది కాదు
సమాధనం కామెంట్ రాయండి ( ఆన్సర్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది.)
12) రెఫ్రిజిరేటర్ లో ఉపయోగించే వాయువు?
A). నైట్రోజెన్
B).ఆక్సిజన్
C).అమ్మోనియా
D).హైడ్రోజన్
సమాధానం : " C " ( అమ్మోనియా ).
13) స్ప్రింగ్ త్రాసు పనిచేసే సూత్రం ఏమిటి?
A).ఆర్కిమెడిస్ సూత్రం
B).ప్లవన సూత్రం
C). హుక్ సూత్రం
D).విశ్వ గురుత్వాకర్షణ సిద్దాంతం
సమాధానం : " C " ( హుక్ సూత్రం ).
14) అయస్కాంతాల తయారీకి వాడే మిశ్రమ లోహం?
A).మెత్తని ఇనుము
B).అల్యూమినియం
C).ఆల్నికో
D). నికెల్
సమాధానం : " C " ( ఆల్నికో ).
15) భూమి పొరల్లో అత్యధికంగా లభించే మూలకం ఏది?
A). బొగ్గు
B).ఇనుము
C).సిలికాన్
D).నత్రజని
సమాధానం : " C " ( సిలికాన్ ).
16) సముద్ర లోతులను కొలిచే సాధనం?
A). అల్టి మీటర్
B). ఫాతో మీటర్
C). హైడ్రో మీటర్
D).మానో మీటర్
సమాధానం :" B " ( ఫాతో మీటర్ ).
17) X-కిరణాలను ఎవరు కనుగొన్నారు?
A).నీల్స్ బోర్
B).రాంట్ జన్
C).థాంసన్
D).రూథర్ ఫర్డ్
సమాధానం : " B " ( రాంట్ జన్ ).
18) సూర్యకాంతి ఎన్ని సెకన్లలో భూమిని చేరుతుంది?
A). 100 సెకన్లు
B).200 సెకన్లు
C).480 సెకన్లు
D).580సెకన్లు
సమాధానం : " C " ( 480 సెకన్లు ).
19) ఎండమావి ఏర్పడడానికి కారణం?
A).కాంతి పరావర్తనం
B).కాంతి వక్రీభవనం
C).కాంతి వ్యతికరణం
D).కాంతి సంపూర్ణంతర పరావర్తనం
సమాధానం : " D " ( కాంతి సంపూర్ణంతర పరావర్తనం ).
20) సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించింది?
A).కోపర్నికస్
B).టాలెమీ
C).హుక్
D). న్యూటన్
సమాధానం : " A " ( కోపర్నికస్ ).
21) రసాయనాల రారాజు అని దేనిని పిలుస్తారు?
A).సల్ఫ్యూరిక్ ఆమ్లం
B).నైట్రికామ్లం
C).సిట్రికామ్లం
D).లాక్టిక్ ఆమ్లం
సమాధానం : " A " ( సల్ఫ్యూరిక్ ఆమ్లం ).
22) గాలిలో ఆక్సీజన్ పరిమాణ శాతం?
A).18 శాతం
B).25 శాతం
C).16 శాతం
D).21 శాతం
సమాధానం : " D " ( 21 శాతం )
23) ఎలక్ట్రిక్ బల్బ్ లో వాడే వాయువు?
A).గాలి
B).ఆక్సిజన్
C).నైట్రోజెన్
D).కార్బన్ డై ఆక్సైడ్
సమాధానం : " C " ( నైట్రోజన్ ).
24) ఫార్మిక్ ఆమ్లం వేటి నుండి ఉత్పత్తి చేయబడుతుంది?
A).బొద్దింకలు
B).చీమలు
C).ఎలుకలు
D).చెద పురుగులు
సమాధానం : " B " ( చీమలు ).
25 ) ఈ క్రింది వానిలో నవ్వు పుట్టించే వాయువు (లాఫింగ్ గ్యాస్) అని దేనిని పిలుస్తారు?
A).సల్ఫ్యూరిక్ ఆమ్లం
B).లాక్టిక్ ఆమ్లం
C).నైట్రస్ ఆక్సయిడ్
D).నైట్రిక్ ఆమ్లం
సమాధానం : " A " ( నైట్రస్ ఆక్సయిడ్ ).
26) మానవజాతి ప్రప్రధమంగా ఉపయోగించిన లోహం ఏది?
A).రాగి
B).బంగారం
C).వెండి
D).ఇనుము
సమాధానం : " A " ( రాగి ).
27) లోథాల్, చామ్హ్ దారో పట్టణాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవి?
A).నౌక నిర్మాణం
B).పూసల పరిశ్రమ
C).నేత పరిశ్రమ
D).లోహ పరిశ్రమ
సమాధానం : " B " ( పూసల పరిశ్రమ ).
28) క్రింది వానిలో బౌద్ధ నిర్మాణం కానిది?
A).స్థూపం
B).విహారం
C).సంఘం
D).చైత్యం
సమాధానం : " C " ( సంఘం ).
29) శాతవాహనులు ఏ మతాన్ని అవలంబించారు?
A).జైన మతం
B).బౌద్ధ మతం
C).హిందూ మతం
D).జుడాయిజం
సమాధానం : " C " ( హిందూ మతం ).
30) కుషాణులు ఏ తెగకు చెందినవారు?
A).హుణులు
B).పార్థియన్లు
C).స్లాన్
D).యూచి
సమాధానం : " D " ( యూచి ).
31) " ప్రజ్ఞా పారమిత సూత్రశాస్త్ర " గ్రంథకర్త ఎవరు?
A).అశ్వఘోషుడు
B).వసుమిత్రుడు
C).నాగార్జునుడు
D).చరకుడు
సమాధానం : " C " ( నాగార్జునుడు ).
32) రఘువంశం అనే గ్రంధాన్ని రచించింది ఎవరు?
A).సముద్ర గుప్తుడు
B).కాళిదాసు
C).బాణుడు
D).హర్షుడు
సమాధానం : " B " ( కాళిదాసు ).
33) చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజధాని నగరం?
A).పాటలీ పుత్రం
B).నలంద
C).ఉజ్జయిని
D).అలహాబాద్
సమాధానం : " A " ( పాటలీ పుత్రం ).
34) చోళుల కాలంలో గ్రామసభలను ఏమని పిలిచేవారు?
A).ఉర్
B).గ్రిహ్
C).అసెంబ్లీ
D).మహాసభ
సమాధానం :" A " ( ఉర్ ).
35) " ప్రచ్ఛన్న బౌద్ధుడు " అని ఎవరిని పిలిచేవారు?
A).రామానుజచార్యులు
B).వల్లభాచార్యులు
C).శంకరాచార్యులు
D).రామానుజుడు
సమాధానం :" C " ( శంకరా చార్యులు ).
36) రాజారామ్ మోహన్ రాయ్ ఏ సంవత్సరంలో ఆత్మీయ సభను స్థాపించారు?
A). 1814
B).1820
C).1815
D).1817
సమాధానం : " C " (1815 ).
37) భారతదేశంలో మొట్టమొదటి మహిళ గవర్నర్ గా పనిచేసినది?
A).సరోజినీ నాయుడు
B).దుర్గాబాయ్ దేశ్ ముఖ్
C).పద్మజానాయుడు
D). అనిబిసెంట్
సమాధానం : " A " ( సరోజినీ నాయుడు ).
38) నీతి ఆయోగ్ ఏర్పాటైన సంవత్సరం?
A).2015, జనవరి 1
B).2016,జూన్ 1
C).2016,జనవరి 1
D).2019 జనవరి 1.
సమాధానం :" A " ( 2015 జనవరి 1 ).
39) భారత ప్రణాళికల రూపశిల్పి ఎవరు?
A).ఎం. విశ్వేశ్వరయ్య
B). జవహర్లాల్ నెహ్రూ
C).సుభాష్ చంద్ర బోస్
D).షణ్ముగం శెట్టి
సమాధానం : " B " ( జవహర్లాల్ నెహ్రూ ).
40) భారత ఆర్థిక సంస్థల పితామహుడు అని ఎవరికి బిరుదు?
A). నెహ్రూ
B).అమర్త్యసేన్
C).పి. వీ. నరసింహారావు
D).అరుణ్ జైట్లీ
సమాధానం : " C " ( పి. వీ. నరసింహారావు ).
41) క్రింది వాటిలో భిన్నమైంది ఏది?
A).DEF
B).GJM
C).NQT
D).BEH
సమాధానం : " A " ( DEF ).
42) ఈ క్రింది వానిలో భిన్నమైన సంఖ్య ఏది?
A).37
B).120
C).145
D).50
సమాధానం : " B " ( 120 ).
43) ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది?
A).ఫిజియోలజీ
B).అనాలజి
C).సైకాలజీ
D).సోషియాలజీ
సమాధానం : " B " ( అనాలజి ).
44) ఈ క్రింది వానిలో భిన్నమైనది?
A).మెర్క్యూరీ
B).చంద్రుడు
C).జుపిటర్
D).సాటర్న్
సమాధానం : " B " ( చంద్రుడు ).
45) ఈ క్రింది ఇంగ్లీష్ నెలలలో భిన్నమైనది?
A). ఏప్రిల్
B).సెప్టెంబర్
C).డిసెంబర్
D).ఫిబ్రవరి
సమాధానం : " B " ( సెప్టెంబర్ ).
46) ఒక కోడ్ లో LIGHT ని GILTH గా రాస్తారు. ఆ కోడ్ లో " RAINY " ని ఎలా రాస్తారు?
A).IARYN
B).ARINY
C).NAIRY
D).RINAY
సమాధానం : " A " ( IARYN ).
47) Z=78, NET = 117 అయిన NUT =?
A).150
B).420
C).165
D).580
సమాధానం : " C " ( 165 ).
48) 6, 4, 4, 8, 48, ?
A).736
B).720
C).744
D).732
సమాధానం : " A " (736).
49) 3, 6, 18, 72, 360, ?
A).1800
B).2160
C).1440
D).1080
సమాధానం : " B " ( 2160 ).
50) ఒక గడియారం 5 గంటలు దాటి 12 నిముషాలు చూపితే, అప్పుడు దాని రెండు ముల్లుల మధ్య కోణం ఎంత?
A). 76°
B).49°
C).84°
D).102°
సమాధానం : " C " ( 84 ° ).
51) GH, JL, NQ, SW, YD, ----?
A).FL
B).EJ
C).FJ
D).EL
సమాధానం : " A " ( FL ).
52) 25:49 :: 121: ----?
A).361
B).256
C).169
D).676
సమాధానం : " C " ( 169 ).
53) 38:63 :: 9 :?
A).80
B).81
C).56
D).32
సమాధానం : " A " (80).
54) పువ్వు : పండు :: పండు : ?
A).ఆకు
B).కూరగాయలు
C).విత్తనం
D).మొక్క
సమాధానం : " C " ( విత్తనం ).
55) 11 సంఖ్యల సగటు 30, మొదటి 5 సంఖ్యల సగటు 25. చివరి 5 సంఖ్యల సగటు 28. అయితే 6 వ సంఖ్య విలువ?
A).75
B).65
C).35
D).45
సమాధానం : " B " (65 ).
56) ఒక విద్యార్థికి తెలుగులో 60, గణితంలో 82, సైన్స్ లో 79, సాంఘికశాస్త్రంలో 63 మార్కులు వచ్చిన అతని సరాసరి మార్కులు?
A).61
B).71
C).89
D).91
సమాధానం : " B " (71).
57) 1-100 వరకూ గల ప్రధాన సంఖ్యలు ఎన్ని?
A).25
B).24
C).23
D).29
సమాధానం : " A " (25).
58) 4 వరుస సరిసంఖ్యల సరాసరి 27.వాటిలో కనిష్ట సంఖ్య ఏది?
A).23
B).22
C).25
D).24
సమాధానం : " D " (24).
59) మొదటి 9 ప్రధాన సంఖ్యల సగటు?
A).9
B).11
C).11 1/9
D). 11 2/9
సమాధానం : " C " ( 11 1/9 ).
60) రెండు సంఖ్యల నిష్పత్తి 12:19. వాటి మొత్తం 217 అయిన వాటిలో పెద్ద సంఖ్య?
A).153
B).204
C).168
D).133
సమాధానం : " D " (133 ).
61) 1.21 మరియు 0.09 ల అనుపాత మాధ్యమం?
A).3.3
B).0.33
C).3.03
D).0.033
సమాధానం : " B " ( 0.33 ).
62) (7-12x) - (3x-7 ) = 14 అయిన x విలువ?
A). -4
B). 0
C).5
D).2
సమాధానం : " B " ( 0 ).
63) 88 చే నిస్సేషంగా భాగించబడే ఐదు అంకెల చిన్న సంఖ్య?
A).10032
B).10132
C).10088
D).10023
సమాధానం : " A " ( 10032 ).
64) 11 : 123 : : 23 : ?
A)531
B).529
C).527
D).523
సమాధానం : " A " (531).
65) రెండు వృత్త వైశాల్యాల నిష్పత్తి 4:9 వాటి పరిధి నిష్పత్తి?
A).3:2
B).6:3
C).6.25
D).6.5
సమాధానం : " C " ( 6.25 ).
66) ఒక పరిభాషలో LONDON ను MPOEPO గా రాసిన DELHI ని ఎలా రాస్తారు?
A). EFIMJ
B).EFMIJ
C).HLDEI
D).DEHLI
సమాధానం : " B " ( EFMIJ ).
67) 2805+2.55=1100 అయిన 280.5+25 =?
A).1.1
B).11
C).110
D).11.22
సమాధానం : " D " ( 11.22 ).
68) a:b = 5:9 మరియు b:c = 4:7 అయిన a:b:c విలువ?
A).5:4:7
B).5:36:28
C).20:36:35
D).20:36:63
సమాధానం : " D " ( 20:36:63 ).
69) ఒక వ్యక్తి ఒక సైకిల్ ను 1400 రూపాయలకు కొని, అమ్మడం ద్వారా 15 % నష్టం పొందిన ఆ సైకిల్ అమ్మిన వెల?
A).1090 రూపాయలు
B).1160 రూపాయలు
C). 1190 రూపాయలు
D). 1202 రూపాయలు.
సమాధానం : " C " ( 1190 రూపాయలు ).
70) 35, 56 మరియు 91 లచే భాగించగా 7 శేషం వచ్చు అతి చిన్న సంఖ్య ?
A).5651
B).3647
C).4647
D).2747
సమాధానం : " B " ( 3647 ).
71) 50 నుంచి'125 వరకూ గల 5 చే భాగింపబడే సంఖ్యల మొత్తం?
A). 6250
B).6075
C).2800
D).1400
సమాధానం : " D " ( 1400 ).
72) ఒక వృత్తం యొక్క భూ పరిధి 264 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యం (సెంటీమీటర్లలో ) ఎంత?
A).5544
B).4545
C).5036
D).4436
సమాధానం : " A " ( 5545 సెంటీమీటర్లు ).
73) 5607 అనే సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య అగుటకు కలుపవలసిన కనిష్ట సంఖ్య?
A).16
B).18
C).27
D).81
సమాధానం : " B " (18)
74) రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3:4 అయిన దాని చుట్టు కొలతల నిష్పత్తి ?
A).1:2
B).4:3
C).2:1
D).3:4
సమాధానం : " D " ( 3:4 ).
75) ఒక వృత్తం వ్యాసార్థం రెట్టింపు చేయగా దాని వైశాల్యం లో పెరుగుదల?
A).8 రెట్లు
B).4 రెట్లు
C).2 రెట్లు
D).16 రెట్లు
సమాధానం : " B " ( 4 రెట్లు ).
76) ఒక పుస్తకమును రూపాయలు 27.50 పైసలుకు అమ్మడం ద్వారా 10% లాభం పొందెను. దానిని రూపాయలు 24.50పైసలకు అమ్మిన వచ్చు లాభం లేదా నష్ట శాతం?
A). 1% లాభం
B).2%లాభం
C).1% నష్టం
D).2% నష్టం
సమాధానం : "D" ( 2% నష్టం ).
77) ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి 4:5:1 అయిన అందలి మిక్కిలి కోణం?
A).72°
B).104°
C).90°
D).63°
సమాధానం : " C " ( 90° ).
78) 6250 రూపాయలకు 2సంవత్సరాలలో 7840 రూపాయలు అయిన చక్రవడ్డీ రేటు?
A).8%
B).10%
C).12%
D).14%
సమాధానం : " C " ( 12% ).
79) ఒక క్రికెట్ బ్యాట్ ను 742 రూపాయలకు అమ్మడం ద్వారా దుకాణదారుడు 6%లాభం పొందిన, దానిపై 8%లాభం రావలెనన్న బ్యాట్ అమ్మకపు వెల?
A).801.36 రూపాయలు
B).786.50 రూపాయలు
C).756.84 రూపాయలు
D).756.00 రూపాయలు
సమాధానం : " D " ( 756.00 రూపాయలు ).
80) ఒక బ్యాంక్ 2000 రూపాయలు డిపాజిట్ చేసిన సొమ్ముపై 5 సంవత్సరాలకు 3000 రూపాయలు ఇచ్చిన, వడ్డీ రేటు?
A). 20%
B).15%
C).10%
D).5%
సమాధానం : " C " ( 10% ).
81) ఒక వృత్తం వ్యాసార్థం రెట్టింపు చేయగా దాని వైశాల్యంలో పెరుగుదల?
A).8 రెట్లు
B).4 రెట్లు
C).2 రెట్లు
D).16 రెట్లు
సమాధానం : " B " (4 రెట్లు ).
82) ఒక పనిని 8 మంది పురుషులు లేదా 12 మంది స్త్రీలు 20 రోజులలో పూర్తి చేయుదురు. అదే పనిని 6 గురు స్త్రీలు మరియు 12 మంది పురుషులు కలిసి పూర్తి చేయుటకు పట్టు రోజులు?
A).15
B).13
C).12
D).10
సమాధానం : " D " ( 10 రోజులు ).
83) ఒక త్రిభుజంలోని మూడు కోణాల నిష్పత్తి 2:3:4 అయిన గరిష్ట మరియు కనిష్ట కోణాల మధ్య గల బేధం?
A).50°
B).30°
C).60°
D).40°
సమాధానం : " D " ( 40 ° ).
84) మొదటి పది బేసి సహజ సంఖ్యల అంకమద్యమం?
A).5
B).10
C).19
D).20
సమాధానం : " B " (10 ).
85) రవి యొక్క తండ్రి ప్రస్తుత వయస్సు, రవి ప్రస్తుత వయస్సుకు మూడు రెట్లు గలదు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 70 సంవత్సరాలు అయిన రవి ప్రస్తుత వయస్సు?
A).25
B).10
C).15
D).20
సమాధానం : " C " ( 15 సంవత్సరాలు ).
86) 8788 పరిపూర్ణ ఘనం అగుటకు గుణించవలసిన కనిష్ట సంఖ్య?
A).2
B).3
C).7
D).13
సమాధానం : " A " (2).
87) 10, 20 మరియు 30 లచే భాగించునపుడు వరుసగా 5, 15 మరియు 25 శేషాలు వచ్చే కనిష్ట సహజ సంఖ్య?
A).65
B).55
C).45
D).35
సమాధానం : " B " (55).
88) రెండు సంఖ్యల లబ్దం 8352 మరియు వాటి గ. సా. గు 87 అయిన క. సా. గు?
A).84
B)96
C).186
D).194
సమాధానం : " B " ( 96 ).
89) ఒక టీ. వీ. ప్రకటన వెల 15, 000 రూపాయలు మరియు దానిని అమ్మిన వెల 10, 500 రూపాయలు అయిన రుసుము శాతం?
A).30
B).25
C).15 1/2
D). 25 1/2
సమాధానం : " A " (30).
90) ఒక తరగతిలో బాలబాలికల మొత్తం సంఖ్య 152. బాలుర కన్నా బాలికల సంఖ్య 20 ఎక్కువైనా తరగతిలో బాలుర సంఖ్య?
A).56
B).78
C).66
D).52
సమాధానం : " C " ( 66 ).
91) ఒక గ్రామ జనాభా ప్రతీ సంవత్సరం 6% వృద్ధి చెందుతుంది. ప్రస్తుత జనాభా 17, 490 అయిన సంవత్సరం క్రితం జనాభా?
A).16440
B).16500
C).16600
D). 16640
సమాధానం : " B " (16500).
92) ఒయాసిస్ తప్పక కల్గి ఉండేది?
A).ఇసుక
B). ఎండ
C).అడవి
D).నీరు
సమాధానం : " D " (నీరు ).
93) ఒక పట్టణ జనాభా మొదట 20% పెరిగి తర్వాత 10% తగ్గిన చివరిగా జనాభా 5400 అయిన తొలి జనాభా ఎంత?
A).5000
B)6000
C)7000
D)8000
సమాధానం : " A " ( 5000 ).
94) 10 మంది ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు.అయిన 25 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు?
A). 3 రోజులు
B). 4 రోజులు
C). 5రోజులు
D) 6రోజులు
సమాధానం : " D "(6 రోజులు ).
95) 200 మీటర్ల పొడవు రైలు 90kmph వేగంతో ఒక స్తంభాన్ని దాటుటకు పట్టు కాలం ఎంత?
A). 2 సెకన్లు
B). 6 సెకన్లు
C). 7 సెకన్లు
D). 8సెకన్లు
సమాధనం కామెంట్ రాయండి ( ఆన్సర్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది )
96) క్రింది వానిలో ఏది లీపు సంవత్సరం కాదు?
A).700
B).800
C).1200
D).2000
సమాధానం : " A " (700).
97) ఒక గోడ గడియారంలో సమయం 7:30 నిముషాలు అవుతుంది. నిమిషాల ముల్లు పచ్చిమ దిశను చూపితే గంటల ముల్లు ఏ దిశను సూచించును?
A).ఆగ్నేయ దిశ
B). వాయువ్య దిశ
C).నైరుతి దిశ
D).ఈశాన్య దిశ.
సమాధానం : " B " ( వాయువ్య దిశ ).
98) నది ఎల్లపుడు తప్పక కల్గి ఉండేది?
A).డెల్టా
B).చేపలు
C).ఒడ్డు
D).ఉపనదులు
సమాధానం : " C " ( ఒడ్డు ).
99) వాతావరణంలో ఎప్పుడు ఉండేది?
A)ఆక్సిజన్
B).గాలి
C).తేమ
D).దుమ్ము
సమాధానం : " B " ( గాలి ).
100) ఈ క్రింది వానిలో భిన్నమైనది?
A).హిందూ
B).టైమ్స్ ఆఫ్ ఇండియా
C).యోజన
D).డెక్కన్ క్రోనికాల్
సమాధానం : " C " ( యోజన ).
రైల్వే గురించి మరిన్ని ఉద్యోగాలు మరియు NTPC మరియు గ్రూప్-D కి ప్రిపేర్ అవ్వడానికి కుడి ప్రక్కన కనిపిస్తున్న టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి గ్రూఫ్ లో చేరండి.
0 Comments