Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Group D Shocking News 2022 : రైల్వే గ్రూప్ - డీ పరీక్షలపై షాకింగ్ అప్డేట్

రైల్వే గ్రూప్ - డీ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ (CEN)No.-RRC-01/2019(లెవెల్ - 1) కు సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ తాజాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి వచ్చినది.

Railway Group D Shocking News 2022

ఇకపై రైల్వే గ్రూప్ - డీ పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పరీక్షలను రెండు దశలలో (రెండు స్టేజ్ లలో )నిర్వహించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలిపింది.

గ్రూప్ - డీ పోస్టుల భర్తీకి సంబంధించిన మొదటి స్టేజ్ (CBT-1) పరీక్షలను కోవిడ్ పరిస్థితులను సునిశితంగా గమనిస్తూ ఫిబ్రవరి 23,2022 నుండి ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఈ ప్రకటనలో పొందుపరిచింది.

ఇక ఈ రైల్వే గ్రూప్ - డీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-2) పరీక్షలకు సంబంధించిన సిలబస్ గురించిన అతి ముఖ్యమైన వివరాలను కూడా ఈ ప్రకటనలోనే భారతీయ రైల్వే బోర్డు తెలిపింది.

ఈ ప్రకటన ప్రకారం రైల్వే గ్రూప్ - డీ పరీక్షల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండవ దశ (CBT-2) పరీక్షల సిలబస్ ఈ క్రింది విధంగా ఉండనుంది.

సీబీటీ - 1 పరీక్షల మాదిరిగానే 10వ తరగతి సిలబస్ స్టాండర్డ్ ఆధారంగానే పరీక్షలలో ప్రశ్నలను అడుగనున్నారు.

రైల్వే గ్రూప్ - డీ CBT - 2 సిలబస్ - వివరాలు :

జనరల్ సైన్స్                                  -    30 మార్కులు.

మాథ్స్ మేటిక్స్                                 -   30 మార్కులు.

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీసనింగ్    -    35 మార్కులు.

జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్   -   25 మార్కులు.

ఈ రైల్వే గ్రూప్ డీ సీబీటీ - 2 పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలను అడుగనున్నారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు అనగా ఒక గంటన్నర సమయంగా ఉంటుంది అని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరచడం జరిగింది.

ఇరు తెలుగు రాష్ట్రాలలో అభ్యర్థులు రైల్వే ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డీ పరీక్షలపై అధికారిక అప్డేట్స్ ను ఈ క్రింది వెబ్సైటు లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Website Link

ముఖ్యమైన గమనిక  అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ సీబీటీ -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును.  ఫోన్ నంబర్ 8179492829 

Notification Link

Post a Comment

0 Comments