Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Special Trains-RRB Exam Preparation | రైల్వే పరీక్షకు ప్రత్యక రైళ్ళ గురించి తెలుసుకుందాం

భారతీయ రైల్వే లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో భాగంగా  రైల్వే మినిస్ట్రీస్, ఎన్టీపీసీ, గ్రూప్ -4 మొదలైన విభాగాలలో నిర్వహించే రైల్వే పరీక్షలకు సమయం ఆసన్నమవుతుంది.

రాబోయే నెల డిసెంబర్ -15 నుండి వివిధ విభాగాలలో మొదలయ్యే ఈ రైల్వే  పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులందరికీ భారతదేశంలో ఉన్న ప్రత్యేకత కల్గిన రైళ్ల గురించిన  అవగాహన అత్యవసరం. ఈ సందర్భంగా భారతదేశం లో రైళ్లు - వాటి ప్రత్యేకతలు అనే అంశంపై  సమగ్రమైన విజ్ఞానాన్ని  మీకు అందిస్తున్నాము.

భారతదేశంలో ముఖ్యమైన రైళ్లు - వాటి ప్రత్యేకతలు :

ఫెయిరీ క్వీన్ :

భారతదేశం లో ప్రస్తుతం ఉన్న అతి పురాతన రైలు ఇంజన్ పేరు  ఫెయిరీ క్వీన్.

దక్కన్ క్వీన్ :

భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు దక్కన్ క్వీన్. ఈ దక్కన్ క్వీన్ రైలు ను పూణే - కళ్యాణ్ మధ్య 1929వ సంవత్సరంలో ప్రారంభించారు.

గతిమాన్ ఎక్స్ ప్రెస్ :

భారతదేశం లో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు పేరు గతిమాన్ ఎక్స్ ప్రెస్. గతి మాన్ ఎక్స్ ప్రెస్ న్యూ ఢిల్లీ నుండి ఝాన్సీ మధ్య గంటకు 160 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.

సంఝౌతా ఎక్స్ ప్రెస్ :

పాకిస్తాన్ మరియు భారత దేశం మధ్య లాహోర్ నుండి కటారి వరకూ ప్రయాణించే రైలు పేరు సంఝౌతా ఎక్స్ ప్రెస్. ఇది భారత దేశంలో అతి తక్కువ దూరం నడుస్తుంది.

శతాబ్ధి ఎక్స్ ప్రెస్ :

శతాబ్ధి ఎక్స్ ప్రెస్ న్యూ ఢిల్లీ నుండి బోఫాల్ మధ్య గంటకు 140 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.

హిమసాగర్ ఎక్స్ ప్రెస్ :

జమ్మూ తావి - కన్యాకుమారి ల మధ్య 3,726 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది.

ధన్వంతరి ఎక్స్ ప్రెస్ :

భారతదేశంలో రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు పేరు ధన్వంతరి ఎక్స్ ప్రెస్.

మైత్రి ఎక్స్ ప్రెస్ :

భారతదేశం లోని పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ ల మధ్య నడపబడుతున్న రైలు పేరు మైత్రి ఎక్స్ ప్రెస్. 

Post a Comment

0 Comments