జనవరి 25 వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 & 2 పరీక్షలలో వచ్చిన బిట్స్ :
నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 మరియు షిఫ్ట్ 2 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు పరీక్షలలో అడిగిన ప్రశ్నలకు సమాధానములను చేర్చి మీకు అందిస్తున్నాము.
ఈ ప్రశ్నలు - జవాబులు రాబోయే రోజుల్లో పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటాయి.
పరీక్షల్లో వచ్చిన బిట్స్ :
1). పాంచ్ మహల్ ఎక్కడ ఉంది?
జవాబు : ఫాతే పూర్ సిక్రి.
2). ఫిమేల్ హార్మోన్స్ అని వేటిని పిలుస్తారు?
జవాబు : ఈస్ట్రోజెన్ మరియు ప్రొజేస్టిరాన్.
3). అగ్ని - 5 మిసైల్ సామర్థ్యం ( రేంజ్ ) ఎంత?
జవాబు : 5,500 నుండి 5,800 కిలోమీటర్లు.4).నయి మంజిల్ యోజన అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభం అయిన సంవత్సరం ?
జవాబు : ఆగష్టు 8,2015.5). ఇబన్ బటూటా ఏ రాజు కాలంలో భారతదేశాన్ని సందర్శించారు?
జవాబు : మొహమ్మద్ బిన్ తుగ్లక్.6).భారత రాజ్యాంగం లో అత్యవసర ఆర్థిక పరిస్థితి ప్రకటనను తెలిపుతూ పొందుపరిచబడిన ఆర్టికల్?
జవాబు : ఆర్టికల్ 360.7).భారతదేశం లో క్రీడారంగంలో విశిష్టమైన సేవలను అందించిన స్పోర్ట్స్ కోచ్ లకు ప్రకటించే అవార్డ్స్ పేరు?
జవాబు : ద్రోణచార్య అవార్డ్స్.8). బ్లాక్ సాయిల్స్ భారత్ లో ఏ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి?
జవాబు : మహారాష్ట్ర మరియు గుజరాత్.9). స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని ఇండియా లో ఎపుడు ప్రారంభం చేసారు?
జవాబు : అక్టోబర్ 2,2014.10). పొవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంధాన్ని రచించినది ఎవరు?
జవాబు : దాదాభాయ్ నౌరోజీ.11). భారత్ లో క్రీడా రంగంలో అత్యున్నత ప్రతిభ పాటవా లు ప్రదర్శించిన క్రీడాకారులకు ఇచ్చే అవార్డ్స్ పేరు?
జవాబు : అర్జున అవార్డ్స్.12). దండి సత్యాగ్రహం ఎపుడు ఆరంభం అయినది?
జవాబు : మార్చి 12,1930.13). మీథెన్ ఫార్ములా?
జవాబు : CH4.
0 Comments