ఆక్షన్ థియరీ కి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ 2020 అవార్డు లభించింది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ అవార్డు -2020 ను ఆర్థిక శాస్త్రంలో నేడు నోబెల్ అవార్డు నిర్వాహకులు ప్రకటించారు.
నూతన ఆక్షన్ ఫార్మాట్ (వేలం విధానంలో నూతన పద్దతి )ను కనుగొన్న
అగ్రరాజ్యం అమెరికా దేశపు ఆర్థికవేత్తలు “పాల్. ఆర్. మిలో గ్రామ్ మరియు రాబర్ట్. బి. విల్సన్ “లకు
ఈ ఏడాది 2020 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డు లభించింది.
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది 2020 నోబెల్ అవార్డు ను దక్కించుకున్న మీలోగ్రామ్ మరియు విల్సన్ లకు ఈ అవార్డుతో బంగారు పతకం
మరియు 1.1 మిలియన్ డాలర్ల ఆర్థిక బహుమతి లభించనుంది.
నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని సాంకేతికంగా స్వేరిగెస్ రిక్స్ బ్యాంకు ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్స్ అని పిలుస్తారు.
గత ఏడాది 2019 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డు ను ప్రపంచ పేదరికాన్ని నిర్ములించడానికి భిన్నమైన ఆర్థిక ప్రణాళిక సూచించిన ప్రవాస భారతీయ ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ
మరియు ఆయన భార్య డఫ్లో కి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ దక్కించుకున్న సంగతి మనకు విదితమే.
రాబోయే పోటీ పరీక్షల కాలంలో ఈ ఏడాది నోబెల్ అవార్డులు -2020 అత్యంత కీలకం కానున్నాయి. కావున అభ్యర్ధులు నోబెల్ అవార్డులు -2020 విభాగంపై ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉంది.
ఈ నోబెల్ 2020 అవార్డులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వపు పరీక్షలలో రానున్న తరుణంలో అభ్యర్థులందరూ ఈ అంశాలను జ్ఞప్తిలో ఉంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించగలరు.
More AP jobs Today
DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ
Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్
DMHO లో మరిన్ని ఉద్యోగాలు
ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
0 Comments