10వ తరగతి పాస్ /ఫెయిల్ తో అప్ప్రెంటీస్ ఉద్యోగాలు, మొబైల్ లో ఇంటర్వ్యూలు, అమర్ రాజా గ్రూప్స్ లో ఉద్యోగాలు, APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ.
10వ తరగతి, ఇంటర్ మరియు ఐటీఐ పాస్ /ఫెయిల్ విద్యా అర్హతలతో అమర్ రాజా గ్రూప్స్ లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను APSSDC తాజాగా విడుదల చేసినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న అమర్ రాజా గ్రూప్స్ లో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం మొబైల్ ఫోన్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
APSSDC ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ / పని తీరు కొలమానముగా ఈ పోస్టులను పేర్మినెంట్ /పని కాల వ్యవధి ని పొడగింపు చేసే అవకాశం కలదు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అమర్ రాజా గ్రూప్స్, చిత్తూరు జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : జూన్ 18 , 2021
టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నిర్వహణ తేది : జూన్ 23, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : 10 AM.
విభాగాల వారీగా ఖాళీలు :
అప్ప్రెంటీస్ ఉద్యోగాలు :
10వ తరగతి ( పాస్ /ఫెయిల్ ) - 50
ఇంటర్ ( పాస్ / ఫెయిల్ ) - 50
ఐటీఐ ( పాస్ / ఫెయిల్ ) - 50
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 150 అప్ప్రెంటీస్ పోస్టులను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
10వ తరగతి / ఇంటర్ /ఐటీఐ (పాస్ /ఫెయిల్ ) అయిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టుల విద్యా అర్హతలు మరియు ఇతరత్రా ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
16 నుండి 29 సంవత్సరాలు వయసు కలిగిన పురుష మరియు స్త్రీ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
హెచ్. ఆర్ రౌండ్ (వర్చ్యువల్ {లేదా } టెలిఫోనిక్ ఇంటర్వ్యూ) విధానముల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
APSSDC ద్వారా భర్తీ చేయబడే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి కరమైన జీతములు లభించనున్నాయి.
ఈ జీతంతో పాటు అభ్యర్థులకు భోజన మరియు వసతి సౌకర్యాలులో రాయితీలు కూడా లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
8142509017
1800-425-2422
0 Comments