కిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాలు, జీతం 25,000 రూపాయలు + ఇతర బెనిఫిట్స్, APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు, ఎటువంటి విద్యార్హతలు లేనివారికి కూడా ఉద్యోగాలు.
ఎటువంటి విద్యా అర్హతలు లేని వారినుండి డిగ్రీ కోర్సులు పూర్తి చేసి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ఆసుపత్రి కిమ్స్ లో నర్సింగ్ స్టాఫ్ , పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్ మరియు టెక్నీషియన్స్ తదితర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు APSSDC తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో లో ఉన్న ప్రముఖ ఆసుపత్రి కిమ్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మరియు ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక మంచి నోటిఫికేషన్ ను జారీ చేసినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
APSSDC ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ / పని తీరు కొలమానముగా ఈ పోస్టులను పేర్మినెంట్ /పని కాల వ్యవధి ని పొడగింపు చేసే అవకాశం కలదు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : జూన్ 15, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
హెచ్. ఆర్ బ్లాక్, 4th ఫ్లోర్ , కిమ్స్ హాస్పిటల్, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
విభాగాల వారీగా ఖాళీలు :
నర్సింగ్ స్టాఫ్ - 40
పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ - 5
హౌస్ కీపింగ్ స్టాఫ్ - 20
టెక్నీషియన్స్ - 20
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా మొత్తం 85 ఉద్యోగాలను అభ్యర్థులకు కల్పించనున్నారు.
అర్హతలు :
జీఎన్ఎం /బీ. ఎస్సీ (నర్సింగ్ ) కోర్సులను పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు నర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్ /డిగ్రీ పూర్తి చేసిన మహిళా మరియు పురుష అభ్యర్థులు పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎటువంటి విద్యా అర్హతలు లేని వారి నుండి ఇంటర్ వరకూ చదువుకున్న ఎవరైనా సరే హౌస్ కీపింగ్ స్టాఫ్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఫ్రెషర్స్ మరియు 5 సంవత్సరాలవరకూ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టుల ఇంటర్వ్యూ లలో పాల్గొనవచ్చునని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాల విద్యా అర్హతలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
విభాగాల పోస్టులను అనుసరించి 19 నుండి 45 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
APSSDC ద్వారా భర్తీ చేయబడే, కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం 25,000 రూపాయలు వరకూ లభించనుంది.
ఈ నెల జీతంతో పాటు ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్ధులకు ఈఎస్ఐ +ఈపీఎఫ్ +బోనస్ +రెగ్యులర్ ఇంక్రిమెంట్స్ మొదలైన ఎన్నో మంచి మంచి బెనిఫిట్స్ లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
99499 14337
62812 05538
1800-425-2422
Registration Link
0 Comments