పరీక్ష లేదు, DRDO లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి, జీతం 31,000 రూపాయలు + ఇతర బెనిఫిట్స్
DRDO లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజషన్ (DRDO) ఆధ్వర్యంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR), చండీ పూర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
DRDO ఆధ్వర్యంలో తాజాగా భర్తీ చేయబోతున్న ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదు. కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది నిరుద్యోగ అభ్యర్థులకు ఒక గొప్ప మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు.
భారీ స్థాయిలో వేతనాలు మరియు ఇతర మంచి బెనిఫిట్స్ లభించే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చునని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ ఈ - మెయిల్ దరఖాస్తుకు చివరి తేది : జూలై 9, 2021
ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహణ తేది : త్వరలో.
ఉద్యోగాలు - వివరాలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) - 5
విభాగాల వారీగా ఖాళీలు :
కంప్యూటర్ సైన్స్ (CSE) /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT ) విభాగంలో ఒక (1) జే. ఆర్. ఎఫ్ పోస్టు మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) /ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ETC) /ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ (E&I) /అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ (AE &I ) విభాగాలలో మరో నాలుగు (4) జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో ప్రధమ శ్రేణి మార్కులతో బీ. ఈ /బీ. టెక్ /ఎం. ఈ/ ఎం. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు వాలీడ్ గేట్ స్కోర్ అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాల విద్యా అర్హతలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
28 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు .
గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ- మెయిల్ ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ ఇంటర్వ్యూలు(వీడియో కాన్ఫరెన్స్/సిస్కో వెబేక్స్ )ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతం 31,000 రూపాయలు నుండి లభించనుంది.
ఈ జీతంతో పాటు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRF) మరియు ఇతర మెడికల్ ఫెసిలిటీ లు లాంటి మంచి బెనిఫిట్స్ లు కూడా లభించనున్నాయి.
Email Address
Website
0 Comments