విశాఖపట్నం లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు, జీతం 2,60,000 రూపాయలు వరకూ ఉంటుంది.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన మినిస్ట్రీస్ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబందించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
భారీ స్థాయిలో మంచి జీతములు లభించే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చునని ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జూన్ 23 , 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది :
పేర్మినెంట్ బేసిస్ : జూలై 20 , 2021
ఫిక్స్డ్టర్మ్ కాంట్రాక్టు బేసిస్ : ఆగష్టు 10, 2021
కన్సల్టెంట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు బేసిస్ : ఆగష్టు 30,2021
ఆఫ్ లైన్ దరఖాస్తులు చేరుటకు చివరి తేది :
పేర్మినెంట్ బేసిస్ : జూలై 30, 2021
ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు బేసిస్ : ఆగష్టు 10, 2021
కన్సల్టెంట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ : సెప్టెంబర్ 10,2021
విభాగాల వారీగా ఖాళీలు :
పేర్మినెంట్ అబ్సరప్షన్ బేసిస్ :
జనరల్ మేనేజర్ (HR) - 1
అడిషనల్ జనరల్ మేనేజర్ (HR) - 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్ ) - 2
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ ) - 1
సీనియర్ మేనేజర్ (టెక్నికల్ ) - 4
మేనేజర్ (టెక్నికల్ ) - 7
మేనేజర్ (ఫైనాన్స్ ) - 1
డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ ) - 1
ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు బేసిస్ (FTC) :
డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగ్మెంటేషన్ ) - 1
డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (SAP బేసిస్ ) - 1
ప్రాజెక్ట్ మేనేజర్ (SAP ABAP డెవలపర్ ) - 1
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (HULL) - 6
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సబ్ మారైన్ టెక్నికల్ ) - 14
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్ షిప్స్ టెక్నికల్ ) - 8
కన్సల్టెంట్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ :
సీనియర్ కన్సల్టెంట్ ( టెక్నికల్ ) - 1
సీనియర్ కన్సల్టెంట్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగ్మెంటేషన్ ) - 1
సీనియర్ కన్సల్టెంట్ (EKM ప్లానింగ్ &సబ్ మారైన్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ ) - 1
సీనియర్ కన్సల్టెంట్ (EKM ప్లానింగ్ &సబ్ మారైన్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ ) - 1
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 53 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో 50%మార్కులతో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ / ఇంజనీరింగ్ డిప్లొమా / బీ. ఈ /బీ. టెక్ /ఎం. ఈ /ఎం. టెక్ /డిగ్రీ ఇన్ లా /ఎంబీఏ (ఫైనాన్స్ ) తదితర కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హతలు మరియు ఇతర మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
కేటగిరీ ల వారీగా ఈ పోస్టులకు 35 సంవత్సరాలు నుండి 62 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఏజ్ రిలేక్సషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
మరియు దరఖాస్తు చేసిన అప్లికేషన్ ఫారమ్ మరియు ఇతర సంబంధిత విద్యా అర్హత సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీలను నిర్ణిత గడువు తేదీలోగా ఈ క్రింది అడ్రస్ కు పోస్ట్ /కొరియర్ ద్వారా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /పీ. హెచ్ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
గ్రూప్ డిస్కషన్స్ / ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 50,000 రూపాయలు నుండి 2,60,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతం తో పాటు TA /DA సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
దరఖాస్తులను పంపవల్సిన చిరునామా :
General Manager (HR),
Hindustan Ship Yard Ltd,
Gandhigram (P. O),
Visakhapatnam - 530005.
0 Comments