Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP High Court Jobs 2021 | ఏపీ హై కోర్ట్ లో ఉద్యోగాలు, నెలకు జీతం 37,100 రూపాయలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్  విడుదల అయినది.

హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి  లో ఖాళీగా ఉన్న కోర్ట్ మాస్టర్స్ మరియు జడ్జి /రిజిస్ట్రార్ లకు పర్సనల్ సెక్రటరీస్ మొదలైన పోస్టులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా జారీ అయినది.ఈ నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకొందాం.

మంచి వేతనాలు లభించే ఈ పోస్టులకు  అర్హతలు గల అభ్యర్థులు అందరూ  అప్లై చేసుకోవచ్చు.

ఒప్పంద ప్రతిపదికన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు, ఏపీ హై కోర్ట్ , అమరావతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు   :

ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది  :  జూలై 21, 2021

ఉద్యోగాలు - వివరాలు :

కోర్ట్ మాస్టర్స్  &  పర్సనల్ సెక్రటరీస్      -        25

విభాగాల వారీగా ఖాళీలు   :

OC            -        12  (  మహిళలు - 4 )

BC-A        -           2 (  మహిళలు  - 1 )

BC-B        -           2 (  మహిళలు  - 1 )

BC-C       -           1

BC-D       -           1 ( మహిళలు -   1 )

BC-E        -          1 ( మహిళలు  -  1 )

SC           -          4  ( మహిళలు -   2 )

ST           -          2   ( మహిళలు -  1 )


అర్హతలు :

ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఆర్ట్స్ /సైన్స్ /కామర్స్ విభాగాలలో డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ అర్హతలను కలిగి ఉండవలెను.

మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ పరీక్ష లలో  (నిమిషానికి 180 పదములు ) / (నిమిషానికి 150 పదములు ) అర్హతలు సాధించిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు .

ఈ ఉద్యోగాల విద్యా అర్హతలకు సంబందించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

18 - 42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులే.

గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలేక్సషన్ కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం ను, సంబంధిత విద్యా అర్హత సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీ లను జత పరిచి క్రింద ఇవ్వబడిన అడ్రస్ కు నిర్ణిత గడువు తేది లోగా పోస్ట్ చేయవలెను.

దరఖాస్తు ఫీజు :

దరఖాస్తు ఫీజులను డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో అభ్యర్థులు చెల్లించవలెను.

OC /BC కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు మరియు SC/ST కేటగిరీ అభ్యర్థులు 350 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

మెరిట్  / షార్ట్ హ్యాండ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతంగా 37, 100 రూపాయలు జీతంగా లభించనుంది.

దరఖాస్తులు పంపవలసిన అడ్రస్ :

Registrar (Administration),

High court of AP,

Nelapadu, Amaravathi,

Guntur District,

Andhra Pradesh,

PIN CODE : 522237

Website 


Post a Comment

0 Comments