Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Medical Job Recruitment | ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

15,000 జీతం ఇవ్వడం జరుగుతుంది. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకాశం జిల్లా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకాశం జిల్లా నుండి పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 



ఒక సంవత్సరానికి గాను అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. 

ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రకాశం జిల్లా లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ  : 29 జులై 2021

అప్లికేషన్ లను పరిశీలించే తేదీ                          : 30 జూలై 2021

లిస్ట్ ఫైనలైజ్ చేసే తేదీ                                       : 1 ఆగస్టు 2021

పోస్టుల సంఖ్య:

పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్  విభాగంలో మొత్తం 17 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

అర్హతలు:

MPC లేదా BiPC లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి.

మరియు

ఏపీ గవర్నమెంట్ నుండి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లో పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్స్ చేసి ఉండాలి. AP Medical Job Recruitment

లేదా

ఏపీ గవర్నమెంట్ నుండి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లో B.Sc (ఆప్టోమెట్రీ) చేసి ఉండాలి.

లేదా

ఏపీ గవర్నమెంట్ నుండి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లో ఆప్టోమెట్రీ టెక్నీషియన్ లో  డిప్లమా చేసి ఉండాలి.

లేదా

ఏపీ గవర్నమెంట్ నుండి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లో ఆప్టోమెట్రీ లో డిప్లమా చేసి ఉండాలి.

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి మరియు క్యాటగిరి లను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

15,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన చిరునామాకు మాన్యువల్ గా గానీ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా గాని తమ అప్లికేషన్ అందజేయవలసి ఉంటుంది.

చిరునామా:

District Medical and Health Officer,

1st floor,

Government General Hospital,

RIMS,

Ongole,

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క రిజర్వేషన్ బట్టి అకాడమిక్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ ఎగ్జామినేషన్ లలో ఉన్న మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

చెల్లించాల్సిన ఫీజు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.


Post a Comment

0 Comments