Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Bharosa Centre Nalgonda District Job Recruitment | భరోసా సెంటర్ నల్గొండ జిల్లా నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ నల్గొండ జిల్లా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ పోస్టులకు కేవలం అర్హత కలిగిన ఫీమేల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది,ఒక సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. 


తరువాత అవసరాన్ని బట్టి పోస్టులను ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది, తెలంగాణకు చెందిన అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. Bharosa Centre Nalgonda District Job Recruitment

మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ :  4 ఆగస్టు 2021

పోస్టుల సంఖ్య:

డేటా ఎంట్రీ ఆపరేటర్ కం అకౌంటెంట్, రిసెప్షనిస్ట్, లీగల్ సపోర్ట్ ఆఫీసర్ వంటి విభాగాలలో మొత్తం 6 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

అర్హతలు:

సెంటర్ కో ఆర్డినేటర్ కం సైకాలజిస్ట్:

సైకాలజీ విభాగంలో MS/MSC చేసి ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ లో అనుభవం ఉన్న వారికి ప్రిఫరెన్స్ జరుగుతుంది.

సపోర్ట్ పర్సన్:

సైకాలజీ లో MS/MSW చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

లీగల్ సపోర్ట్ ఆఫీసర్:

LLB/LLM చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.

మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ANM:

BSC నర్సింగ్ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ కం అకౌంటెంట్:

డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరియు టాలీ, ఎమ్మెస్ ఆఫీస్ లో నాలెడ్జ్ కలిగి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.

రిసెప్షనిస్ట్:

ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి మరియు ఫ్రెంట్ ఆఫీసులో పని చేయుటకు కావలసిన అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు:

పోస్ట్ ను బట్టి 20 నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు  క్రింద ఇవ్వబడిన చిరునామాకు తమ అప్లికేషన్ పంపవలసి ఉంటుంది

చిరునామా:

Office of the superintendent of police,

Nalgonda district,

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క అర్హతలు మరియు అనుభవాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

చెల్లించాల్సిన ఫీజు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.


Post a Comment

0 Comments