Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Indian Navy Jobs Recruitment 2021 | ఇండియన్ నేవీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

ఇండియన్ నేవీ నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ క్యాడర్ లో ఎలక్ట్రికల్ విభాగంలో పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ పోస్టులకు అర్హత కలిగిన అన్ మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

Indian Navy Jobs Recruitment 2021

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ కేరళ లో కోర్స్ నిర్వహించడం జరుగుతుంది. Indian Navy Jobs Recruitment 2021

మరియు ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ                     : 16 జులై 2021

ఆన్ లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ   : 30 జులై 2021

పోస్టుల సంఖ్య:

SSC ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ విభాగంలో మొత్తం 40 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

అర్హతలు:

ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ పవర్ ఇంజనీరింగ్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఇన్స్ట్రుమెంటేషన్ / అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్  విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో BE లేదా BTech పూర్తి చేసి ఉండాలి.

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2 జనవరి 1997 నుండి 1 జూలై 2002 సంవత్సరాల మధ్య పుట్టి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు షార్ట్లిస్ట్ చేసి SSB ఇంటర్వ్యూ లో ఉన్న మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

చెల్లించవలసిన ఫీజు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. 


Post a Comment

0 Comments