2021- 2022 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి లోకి ప్రవేశాలు పొందడానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తేదీలను ప్రకటించడం జరిగింది.
దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ గతంలో పూర్తి కావడం జరిగింది, అయితే కరోనా కారణంగా ఈ పరీక్షలు వాయిదా పడుతూ రావడం జరిగినది.
కావున దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆగస్టు 11 వ తేదీన ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేయడం జరిగింది. Navodaya Entrance Examination Date Released
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లీష్ మరియు హిందీ భాష తో పాటు వారి యొక్క రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ లో ఈ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది.
మరియు మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ లాంగ్వేజ్ విభాగాల నుండి విద్యార్థులకు 100 మార్కులకు ఈ ఎగ్జామినేషన్ 2 గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఎగ్జామినేషన్ కు హాజరైన విద్యార్థుల యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మార్కుల లో ఉన్న మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరుగుతుంది.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
0 Comments