Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Gail Jobs | పరీక్ష లేదు, Gail ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ

భారత ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో ఉన్న  నవరత్న కంపెనీ అయిన గేయిల్ ఇండియా లిమిటెడ్, న్యూ ఢిల్లీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.



ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, కేవలం ఇంటర్వ్యూ /గ్రూప్ డిస్కషన్స్ ద్వారా భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.

మంచి జీతములు లభించే ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గేయిల్ ఇండియా లిమిటెడ్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది    :   జూలై 29, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

చీఫ్ జనరల్ మేనేజర్ (లా )              -        1

చీఫ్ మేనేజర్ (HR)                             -      10

అర్హతలు :

చీఫ్ జనరల్ మేనేజర్ (లా ) విభాగంలో పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 50% మార్కులతో బాచిలర్ డిగ్రీ ఇన్ లా (LLB) కోర్సులను పూర్తి చేయవలెను.

చీఫ్ మేనేజర్ (HR) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 60% మార్కులతో బాచిలర్ డిగ్రీ / రెండు సంవత్సరాల MBA / MSW /మాస్టర్ డిగ్రీ /రెండు సంవత్సరాల పీజీ డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

52 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /EWS/ఓబీసీ అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ /PWD కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ / గ్రూప్ డిస్కషన్స్ / ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 90,000 రూపాయలు నుండి 2,80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ జీతంతో పాటు వసతి సౌకర్యాలు, HRA, మెడికల్ ఫెసిలిటీ, గ్రూప్ ఇన్సూరెన్స్, హౌస్ బిల్డింగ్ అలోవెన్స్ లాంటి మంచి బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి.

మీరు మరిన్ని జాబ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో good Job అని కామెంట్ రాయండి. ఇట్లు మీ నాగేశ్వరరావు.

Website 

Notification 

Post a Comment

0 Comments