Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Indian Air Force Group C Civilian Posts Job Recruitment | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి గ్రూఫ్ C ఉద్యోగాల భర్తీ

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి గ్రూప్ సి విభాగంలో  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది,డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు, ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియా మొత్తంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.Indian Air Force Group C Civilian Posts Job Recruitment

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ: 24 జులై 2021
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదల అయిన 30 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 84 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

అర్హతలు:

సూపర్డెంట్ స్టోర్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏ విభాగంలో అయిన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి లేదా సమానమైన అర్హతలు కలిగి ఉండాలి.

లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపింగ్:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు  నుండి 12 వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు కావలసిన టైపింగ్ స్పీడ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

స్టోర్ కీపర్:

గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పన్నెండో తరగతి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి మరియు 
సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

మిగిలిన అన్ని పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి మరియు పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు మరియు డిపార్ట్మెంటల్ ఎంప్లాయిస్ కు 40 నుండి 45 సంవత్సరాలు లోపు వయస్సు కలిగి ఉండాలి.

జీతం:

పే మ్యాట్రిక్స్ 7th CPC ప్రకారం పోస్ట్ ను బట్టి
లెవెల్-1, లెవెల్-2, లెవెల్-4 ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు పైన ఇవ్వబడిన తేదీలోపు అప్లికేషన్ ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోస్ట్ ని బట్టి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ ద్వారా  అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

చెల్లించాల్సిన ఫీజు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.


Post a Comment

0 Comments