Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Mazagon Dock Recruitment 2021 | 8th,10th క్లాస్ అర్హతలతో 425 ఖాళీల భర్తీ

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన మజాగన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్స్, ముంబై  లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 425 అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

అతి తక్కువ విద్యా అర్హతలతో, గ్రూప్ - A, బీ, C విభాగాలలో  భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని ప్రకటనలో తెలిపారు.


కావున, ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన  తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది                :   జూలై 22, 2021

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది                        :   ఆగష్టు 10, 2021

ఎలిజిబుల్ కాండిడేట్స్ లిస్ట్ విడుదల తేది  :  ఆగష్టు 16, 2021

హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది                                :  ఆగష్టు 23, 2021

ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది                            :  ఆగష్టు 4వ వారం

  
విభాగాల వారీగా ఖాళీలు  :

గ్రూప్ - A పోస్టులు :

డ్రాఫ్ట్స్ మెన్ ( మెకానికల్ )     -     20

ఎలక్ట్రీషియన్                         -     34

ఫిట్టర్                                       -     62

పైప్ ఫిట్టర్                              -     72

స్ట్రక్చరల్ ఫిట్టర్                       -    63


గ్రూప్ - B పోస్టులు  :

ఫిట్టర్ (స్ట్రక్చరల్ )           -        20

ఎలక్ట్రీషియన్                   -       15

పైప్ ఫిట్టర్స్                     -        15

వెల్డర్స్                              -        15

కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 15

కార్పెంటర్                     -         21

గ్రూప్ - C పోస్టులు  :

రిగ్గర్                                          -        47

వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రికల్ )    -        26

అర్హతలు :

విభాగాలను అనుసరించి 8వ,10వ తరగతులలో ఉత్తీర్ణత సాధించినవారు మరియు సంబంధిత ట్రేడ్స్ లలో ఐటీఐ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ అప్ప్రెంటీస్  ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

14 నుండి 21 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం బీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. మిగిలిన కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ పరీక్ష విధానం ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

ఈ పరీక్షను  మొత్తం 100 మార్కులకు నిర్వహించనున్నారు.

స్టై ఫండ్ :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆసక్తికరమైన స్టై ఫండ్ లభించనుంది.

Website  

Notification

Post a Comment

0 Comments