ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో ఉన్న ఎస్విఆర్ఆర్ (SVRR) గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
మంచి వేతనాలు లభించే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతం తదితర ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేది : జూలై 16 , 2021
విభాగాల వారీగా ఖాళీలు :
పిడిట్రిషియన్స్ - 126
స్టాఫ్ నర్స్ - 27
సపోర్టింగ్ స్టాఫ్ - 9
మొత్తం పోస్టులు :
మొత్తం 162 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి 10వ తరగతి /డిప్లొమా (GNM)/ బీ. ఎస్సీ (నర్సింగ్ ), పిడియాట్రిక్స్ లో ఎండి /డిఎన్బీ /డిసిహెచ్ కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ /ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
అర్హత పరీక్ష లలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ ల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 15,000 రూపాయలు నుండి 1,50,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవలసిన అడ్రస్ :
సూపరింటెండెంట్ కార్యాలయం, SVRR GGH, తిరుపతి.
0 Comments