బిగ్ బ్రేకింగ్ అప్డేట్, రైల్వే ఎన్టీపీసీ , గ్రూప్ డీ పరీక్ష తేదీలు ఖరారు, భారతీయ రైల్వే బోర్డు అధికారిక ప్రకటన, జూలై, ఆగష్టు లలో పరీక్షలు
రైల్వే ఎన్టీపీసీ మరియు గ్రూప్ -డీ పరీక్షల నిర్వాహణ పై భారతీయ రైల్వే బోర్డు నుండి ఒక ముఖ్యమైన అధికారిక ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ నోటీస్ ప్రకారం రైల్వే ఎన్టీపీసీ పరీక్ష తేదీల నిర్వహణ క్రింది విధంగా ఉంది.
రైల్వే ఎన్టీపీసీ - 7th ఫేజ్ పరీక్ష తేదీలు :
జూలై 23, జూలై 24, జూలై 26, జూలై 31.
ఈ నాలుగు రోజులలో సుమారు 2.78 లక్షల మంది అభ్యర్థులకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
జూలై నెలలో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు పూర్తి అయిన వెంటనే రైల్వే గ్రూప్ - డీ పరీక్షలను ఆగష్టు, 2021 నెలలో నిర్వహించే వీలున్నట్లు తెలుస్తుంది.
రైల్వే గ్రూప్ - డీ పరీక్షల నిర్వహణ తేదీలపై కూడా అధికారిక నోటీసు మరో 7 నుండి 10 రోజుల లోపు విడుదల కానున్నట్లు సమాచారం అందుతుంది.
ఈ రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల ఎగ్జామ్స్ తేదీలు మరియు పరీక్షల నిర్వహణ నగరాలు మరియు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఉచిత ట్రావెల్లింగ్ పాస్ తదితర ముఖ్యమైన వివరాలను అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష తేదీల 10 రోజుల ముందు నుండి రైల్వే అధికారిక వెబ్సైటు లో నుండి తెలుసుకోవచ్చు.
0 Comments