మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న నవరత్న కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL),
బెంగళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 511 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు నిర్వహణ లేకుండా ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్దతిలో ఇంజనీర్స్ పోస్టుల భర్తీని చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. BEL Recruitment 2021
సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : ఆగష్టు 15, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ట్రైనీ ఇంజనీర్స్ - 308
ప్రాజెక్ట్ ఇంజనీర్స్ - 203
మొత్తం పోస్టులు :
మొత్తం 511 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హతలు గల అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి బీఈ / బీ. టెక్ కోర్సులను పూర్తి చేసి ఉన్న ఫ్రెషర్స్ / అనుభవం ఉన్న అభ్యర్థులు విభాగాల వారీగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
25 నుండి 28 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు విభాగాలను అనుసరించి 200 మరియు 500 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ / దివ్యంగులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
విద్యా అర్హత మెరిట్ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరిల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం 50,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
0 Comments