ప్రముఖ భారతీయ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి తాజాగా SBI, ముంబై నుండి ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ ఉద్యోగాలు అన్నిటిని రెగ్యులర్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వివిధ విభాగాలలో భర్తీ చేసే ఈ పోస్టులలో కొన్ని కేటగిరీ పోస్టులను ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అని ప్రకటనలో పొందుపరిచారు.
అయితే ఈ పోస్ట్ లకు సంబందించి అతి ముఖ్యమైన సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం. SBI Officer Post Recruitment 2021 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది : ఆగష్టు 13, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : సెప్టెంబర్ 2, 2021
ఎడిటింగ్ అప్లికేషన్స్ కు చివరి తేది : సెప్టెంబర్ 2, 2021
ప్రింటింగ్ అప్లికేషన్స్ కు చివరి తేది : సెప్టెంబర్ 17, 2021
అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల పరీక్ష తేది : సెప్టెంబర్ 25, 2021
అసిస్టెంట్ మేనేజర్ పరీక్షల కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది : సెప్టెంబర్ 13, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ కమ్యూనికేషన్) - 4
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ( సివిల్ ) - 36
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ ) - 10
డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్ ) - 10
రిలేషన్ షిప్ మేనేజర్ ( OMP) - 6
ప్రోడక్ట్ మేనేజర్ ( OMP) - 2
మొత్తం ఖాళీలు :
మొత్తం 68 పోస్టులను తాజాగా వెలువడిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత విభాగాలలో ఎంబీఏ /పీజీడీఎం/సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలలో డిగ్రీ పీజీ కోర్సులను /బీఈ /బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో అనుభవం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
21 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /EWC/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 750 రూపాయలు దరఖాస్తు ఫీజులను చెల్లించవలెను.
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగుల అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
కేటగిరీలను అనుసరించి అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ కమ్యూనికేషన్ ), డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్ ), రిలేషన్ షిప్ మేనేజర్ (OMP), ప్రోడక్ట్ మేనేజర్ (OMP) ఉద్యోగాలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక చేయనున్నారు.
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్ ), అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ ) ఉద్యోగాలకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం 36,000 రూపాయలు నుండి 63,840 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments