యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 347 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
భారీ స్థాయిలో వేతనాలు లభించే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియి తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది : ఆగష్టు 12, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : సెప్టెంబర్ 3, 2021
ప్రింటింగ్ అప్లికేషన్స్ కు చివరి తేది : సెప్టెంబర్ 18, 2021
పరీక్షల నిర్వహణ తేది : అక్టోబర్ 9, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
సీనియర్ మేనేజర్ ( రిస్క్ ) - 60
మేనేజర్ (రిస్క్ ) - 60
మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్ ) - 7
మేనేజర్ (ఆర్కిటెక్ట్ ) - 7
మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) - 2
మేనేజర్ ( ప్రింటింగ్ టెక్నాలజీస్ట్ ) - 1
మేనేజర్ ( ఫారెక్స్ ) - 50
మేనేజర్ (ఛార్టర్డ్ అకౌంటెంట్ ) - 14
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) - 26
అసిస్టెంట్ మేనేజర్ ( ఫారెక్స్ ) - 120
మొత్తం పోస్టులు :
తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా మొత్తం 347 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత విభాగాల్లో ఎంబీఏ /పీజీ /సీఏ/సీఎంఏ(ICWA)/CS/బీ. ఈ /బీ. టెక్ /గ్రాడ్యుయేషన్ /పీజీడీబీఏ /పీజీడీబీఎం/పీజీడీఎం/ఛార్టర్డ్ అకౌంటెంట్/బీ. ఫార్మసీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు కేటగిరీలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని తెలిపారు.
వయసు :
20 నుండి 40 సంవత్సరాల లోపు వయసున్న అభ్యర్థులు విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /EWS/ఓబీసీ అభ్యర్థులు 850 రూపాయలు దరఖాస్తు ఫీజును చెల్లించవలెను. ఎస్సీ /ఎస్టీ / దివ్యాంగులకు ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష / గ్రూప్ డిస్కషన్ /పర్సనల్ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 36,000 రూపాయలు నుండి 78,230 రూపాయలు వరకూ జీతం అందనుంది.
పరీక్ష కేంద్రాలు - ఎంపిక :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు హైదరాబాద్ ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోవచ్చు.
Website
ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కొరకు ఈ లింక్ ఒపెన్ చెయ్యండి Clik Here
0 Comments