ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చినది.
గ్రామ /వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన ప్రోబేషనరి కాలపరిమితి ముగింపు కు సంబంధించిన కీలకమైన ప్రకటనను ఏపీ గ్రామ /వార్డ్ సచివాలయ ముఖ్య కార్యదర్శి చేశారు.

రాబోయే నెల అక్టోబర్ 2వ తేది నాటికీ గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన సుమారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల (1.34 లక్షలు ) మంది అభ్యర్థులకు ప్రొబేషనరి పీరియడ్ రెండు సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. AP Grama Ward Sachivalayam Update Telugu
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం డిపార్టుమెంటు టెస్టులలో ఉత్తీర్ణత సాధించి,
వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న అభ్యర్థుల వివరాలను అందించడానికి ఆయా జిల్లాలు అవసరమైన చర్యలను చేపట్టాలని కార్యదర్శి కీలకమైన ప్రకటన చేశారు.
తాజాగా జారీ అయిన ఈ కీలక ప్రకటన ద్వారా డిపార్టుమెంటు పరీక్షలలో పాస్ అయ్యి,
వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయ్యి, రెండు సంవత్సరాల ప్రోబేషనరీ పీరియడ్ ను పూర్తి చేసుకున్న అభ్యర్థులు అందరిని ఈ ఉద్యోగాలలో రెగ్యులర్ చేయనున్నారు.
కాగా , రెగ్యులర్ కానున్న ఈ గ్రామ /వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన జీత భత్యాలు మరిన్ని వివరాలకు సంబంధించిన విధి విధానాలు అతి త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం అందుతుంది.
వైజాగ్ లో ఉద్యోగాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. Clik Here
ప్రకాశాం జిల్లా లో అమెజాన్, మరియు ఇతర ఉద్యోగాల భర్తీ Clik Here
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు Clik Here
0 Comments