ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన జారీ అయినది.
ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ హై కోర్ట్ ఆఫ్ ఏపీ, అమరావతి నుండి ఇటీవల వెలువడినది. AP High Court Jobs 2021
నోటిఫికేషన్ ముఖ్యంశాలు :
1). డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.
2). శాశ్వత మైన నియామకాలు.
3). భారీ స్థాయిలో జీతములు.
ఏపీ హై కోర్ట్ లో ప్రత్యక్ష పద్దతిలో, పేర్మినెంట్ గా భర్తీ చేయనున్న ఈ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ నోటిఫికేషన్ లో తెలిపారు.
మంచి వేతనాలు లభించే ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : సెప్టెంబర్ 30, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ - 71
ఎగ్జామినర్ - 29
టైపిస్ట్ - 35
కాపీయిస్ట్ - 39
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా మొత్తం 174 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి ఆర్ట్స్ /సైన్స్ /కామర్స్ /లా విభాగాలలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
మరియు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి టైప్ రైటింగ్ ( ఇంగ్లీష్ ) హయ్యర్ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించవలెను.
వయసు :
42 సంవత్సరాలు లోపు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎక్స్ - సర్వీస్ మెన్స్ కు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఓసీ / బీసీ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయలును మరియు EWS / ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 400 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
ఈ పరీక్షలో జనరల్ నాలెడ్జ్ (GK), ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు రీసనింగ్ అంశాలపై అభ్యర్థులను ప్రశ్నలు అడగనున్నారు.
ఈ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించిన అభ్యర్థులను 1:3 రేషియో లో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ లకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 16,400 రూపాయలు నుండి 49,870 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments