Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP NHM Jobs Telugu : పరీక్ష లేదు, ఏపీ లో 858 ప్రభుత్వ ఉద్యోగాలు

నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఆధ్వర్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన ఏపీ లో ఉన్న జిల్లాల DMHO లలో  వివిధ  విభాగాలలో ఖాళీగా ఉన్న

AP NHM Jobs Telugu
పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది. AP NHM Jobs Telugu

ముఖ్యమైన అంశాలు  :

1) తక్కువ విద్యా అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలు,

2). కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాల భర్తీ,

3). భారీ స్థాయిలో  జీతములు.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ఆధారంగా భర్తీ చేసే ఈ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు అర్హతలు గల ఏపీ రాష్ట్రానికి చెందిన అన్ని రాష్ట్రముల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

భారీ స్థాయిలో వేతనాలు లభించే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

దరఖాస్తుకు ప్రారంభం తేది               :     సెప్టెంబర్ 2 , 2021

దరఖాస్తుకు చివరి తేది                       :    సెప్టెంబర్ 15, 2021

ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది :   సెప్టెంబర్ 22, 2021

ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది         :   సెప్టెంబర్ 27, 2021

అప్పోయింట్మెంట్ తేది                         :   సెప్టెంబర్ 30, 2021

విభాగాల వారీగా ఖాళీలు   :

మెడికల్ స్టాఫ్ :

స్పెషలిస్ట్స్                    -            53

మెడికల్ ఆఫీసర్స్         -          308

స్టాఫ్ నర్స్                       -          324

ల్యాబ్ టెక్నీషియన్స్     -           14

పారామెడికల్ స్టాఫ్        -           90

కన్సల్టెంట్                      -           18

సపోర్ట్ స్టాఫ్                      -          56

మొత్తం పోస్టులు   :

మొత్తం 858 ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

పోస్టుల విభాగాలను అనుసరించి 10వ తరగతి /జీఎన్ఎం /బీఎస్సీ (నర్సింగ్ )/డీఎంఎల్ /టీఎంఎల్టీ /బీ. ఎస్సీ (ఎంఎల్టీ ) మరియు సంబంధిత సబ్జెక్టు లలో బాచిలర్ డిగ్రీ / MNW/MA (సోషల్ వర్క్ ), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ /పీజీ డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

34 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు.

ఆయా కేటగిరీలను అనుసరించిన అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ వెబ్సైటు లో ఉన్న దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, ఫారం ను నింపి, తదుపరి సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరిచి  ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖధికారి కార్యాలయం లో నిర్ణిత గడువు తేదీలలోగా అందించవలెను.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం   :

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతముగా 12,000 రూపాయలు నుండి 1,10,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website  

Notification and Apply Link

Post a Comment

0 Comments