ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3393 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా వెలువడినది.
ఏపీ స్టేట్ లో ఉన్న 13 జిల్లాలలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్ జారీ చేసినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కాంట్రాక్టు బేసిస్ పోస్టులు.
2). మంచి స్థాయిలో జీతములు లభించనున్నాయి.
జోన్ల వారీగా ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేసే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. AP 3393 MLHP Jobs Telugu
ఆసక్తి కరమైన జీతములు లభించే ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇంపార్టెంట్ వివరాలు గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ విడుదల తేది : అక్టోబర్ 23, 2021
ఆన్లైన్ అప్లికేషన్స్ కు చివరి తేది : నవంబర్ 6, 2021
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రకటన తేది : నవంబర్ 10,2021
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : నవంబర్ 15,2021
ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల తేది : నవంబర్ 24,2021
కౌన్సిలింగ్ నిర్వహణ తేదీలు : నవంబర్ 27-30.
విభాగాల వారీగా ఉద్యోగాలు :
మిడ్ - లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ - 3393
జోన్ల వారీగా ఖాళీలు :
జోన్ - 1 :
శ్రీకాకుళం, విజయనగరం,మరియు విశాఖపట్నం - 633
జోన్ - 2 :
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మరియు కృష్ణా - 1033
జోన్ -3 :
గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు - 786
జోన్ -4 :
చిత్తూరు, కడప, అనంతపురం మరియు కర్నూల్ - 971
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ స్టేట్ లో జోన్ల వారీగా ఉన్న 13 జిల్లాలలో మొత్తం 3393 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి బీ. ఎస్సీ (నర్సింగ్ ) కోర్సులను పూర్తి చేయవలెను. మరియు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి ఉండవలెను.
వీటితో పాటు కమ్యూనిటీ హెల్త్ (CPCH) సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ను చేసి ఉండవలెను అని ఈ నోటిఫికేషన్ లో తెలిపారు.
వయసు :
35 సంవత్సరాలు లోపు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
బీసీ /ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు కేటగిరీలకు 5 సంవత్సరాలు వయసు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
విద్యార్హతల మార్కులను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులును ఎంపిక చేయనున్నారు.
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేదు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆసక్తికరమైన జీతములు లభించనున్నాయి.
ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతంగా సుమారుగా 25,000 రూపాయలు వరకూ లభించనుంది.
0 Comments