Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

IOCL 1968 Vacancies Telugu : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 1968 ఖాళీలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 1968 ఖాళీలు, వెంటనే అప్లై చేసుకోండి. 

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కు చెందిన భారత దేశ వ్యాప్తంగా ఉన్న రీఫైనరీస్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 1968  అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన  అప్ప్రెంటీస్ ఉద్యోగాలు.

2). ఈ అప్ప్రెంటీస్ షిప్ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో  సహకరిస్తుంది.

భారీ సంఖ్యలో భర్తీ కానున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

IOCL 1968 Vacancies Telugu

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు అర్హులే అని ప్రకటన లో తెలిపారు.

IOCL ద్వారా జారీ అయిన ఈ  కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ అప్లికేషన్స్ కు  ప్రారంభం తేది      :    అక్టోబర్ 22, 2021

ఆన్లైన్ అప్లికేషన్స్ కు  చివరి తేది             :   నవంబర్ 12, 2021

అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ తేది                       :    నవంబర్ 16-20

వ్రాత పరీక్ష నిర్వహణ తేదీలు                 :   నవంబర్ 21,2021

వ్రాత పరీక్ష ఫలితాలు విడుదల తేది       :    డిసెంబర్ 4, 2021

డాకుమెంట్స్ వెరిఫికేషన్ తేది                :    డిసెంబర్ 13-20

విభాగాల వారీగా ఖాళీలు    :

ట్రేడ్ అప్ప్రెంటీస్ -అటెండెంట్ ఆపరేటర్        -      488

ట్రేడ్ అప్ప్రెంటీస్ (ఫిట్టర్ )                                     -    205

ట్రేడ్ అప్ప్రెంటీస్ బాయిలర్ (మెకానికల్ )          -       80

టెక్నీషియన్ అప్ప్రెంటీస్ (కెమికల్ )                   -     362

టెక్నీషియన్ అప్ప్రెంటీస్ (మెకానికల్ )               -     236

టెక్నీషియన్ అప్ప్రెంటిస్ (ఎలక్ట్రికల్ )                -     285

టెక్నీషియన్ అప్ప్రెంటీస్ (ఇన్స్ట్రుమెంటేషన్ ) -    117

ట్రేడ్ అప్ప్రెంటీస్ (సెక్రటరియేల్ అసిస్టెంట్ )       -     69

ట్రేడ్ అప్ప్రెంటీస్ (అకౌంటెంట్ )                            -     32

ట్రేడ్ అప్ప్రెంటీస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్ )           -     53

ట్రేడ్ అప్ప్రెంటీస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్)             -    41


రీఫైనరీలు - ఖాళీలు   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు గువహటి, బరోని, గుజరాత్, హల్దీయా, మధుర, పానీపట్, దిగ్బోయ్ తదితర ప్రాంతాలలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన రీఫైనరిలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

మొత్తం ఉద్యోగాలు  :

తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1968 కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులు /ట్రేడ్ లలో మెట్రిక్యూలేషన్ /ఐటీఐ / ఇంజనీరింగ్  డిప్లొమా /బీ. ఎస్సీ /బీ. కాం కోర్సులలో ఉత్తీర్ణులు అయ్యి ఉండవలెను.

వయసు  :

24 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి  :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం   :

వ్రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్  :

అప్ప్రెంటిస్ షిప్ రూల్స్ ప్రకారం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తికరమైన స్టై ఫండ్స్ లభించనున్నాయి.

Website

Notification

Post a Comment

0 Comments