పరీక్ష లేదు, DRDO లో 116 అప్ప్రెంటీస్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేసుకోండి.
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజషన్ (DRDO) కు చెందిన చాంది పూర్ (ఒడిశా )లోని డీఆర్డీఓ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబందించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
1). పరీక్షలు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలు,
2).మంచి స్థాయిలో స్టై ఫండ్ లు లభించును.
3).ఈ అప్ప్రెంటీస్ షిప్ రాబోయే రోజుల్లో DRDO లో భర్తీ చేసే ఉద్యోగాలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. DRDO 116 Vacancies
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు అర్హులే నని నోటిఫికేషన్ లో తెలిపారు.
DRDO లో భర్తీ చేయబోతున్న ఈ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : నవంబర్ 1, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : నవంబర్ 15,2021
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ - 50
డిప్లొమా(టెక్నీషియన్ ) అప్ప్రెంటీస్ - 40
ట్రేడ్ అప్ప్రెంటీస్ - 26
మొత్తం పోస్టులు :
మొత్తం 116 సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లలో లేదా ట్రేడ్ లలో బీ. ఈ /బీ. టెక్ /బీ.కాం /బీబీఏ/ఇంజనీరింగ్ డిప్లొమా /ఐటీఐ కోర్సులను 2019,2020,2021 సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను.
అనగా పై విద్యార్హతలలో 2019,2020,2021 అకాడమిక్ ఇయర్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు అని నోటిఫికేషన్ లో తెలిపారు.
వయసు :
వయసు పరిమితి నిబంధనను ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
విద్యార్హతల మార్కుల పెర్సెంటేజ్ / షార్ట్ లిస్ట్ మరియు ఆన్లైన్ విధానంలో వర్చ్యువల్ ఇంటర్వ్యూ (వీడియో కాన్ఫరెన్స్ )ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అప్ప్రెంటీస్ షిప్ రూల్స్ ప్రకారం నెలకు ఆకర్షణీయమైన స్టై ఫండ్ లభించనుంది.
0 Comments