APPSC నుండి నోటిఫికెషన్స్ విడుదల, 151 ఆఫీసర్స్ ఉద్యోగాలు, జీతం 91,450 రూపాయలు వరకూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వివిధ ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న 1180 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికెషన్స్ ను ఏపీ జాబ్ క్యాలెండరు 2021 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేయడం ప్రారంభించినది. APPSC Jobs Salary 91,450 Apply Now
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయుష్ డిపార్టుమెంటు కు చెందిన ఆయుర్వేదం, హోమియో పతి మరియు యునాని విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 151 మెడికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటనను ఏపీపీఎస్సీ జారీ చేసినది.
నోటిఫికేషన్ - ముఖ్యమైన అంశాలు :
1). శాశ్వత నియామక ప్రభుత్వ ఉద్యోగాలు
2). భారీ స్థాయిలో జీతములు
3). వయో పరిమితి పెంపు
మంచి స్థాయి లో వేతనములు లభించే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేయబడుతున్న ఈ పేర్మినెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాల ప్రకటనకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది : అక్టోబర్ 4 , 2021
ఆన్లైన్ ఫీజు పేమెంట్ కు చివరి తేది : అక్టోబర్ 24, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : అక్టోబర్ 25, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
మెడికల్ ఆఫీసర్స్ ( ఆయుర్వేద ) - 72
మెడికల్ ఆఫీసర్స్ ( హోమియోపతీ ) - 53
మెడికల్ ఆఫీసర్స్ ( యునానీ ) - 26
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో మొత్తం 151 మెడికల్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డుల నుండి ఆయుర్వేదం /హోమియో పతీ /యూనానీ కు చెందిన సంబంధిత సబ్జెక్టు లలో డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు ఒక సంవత్సరం ఇంటర్న్ షిప్, సంబంధిత విభాగంలో పేర్మినెంట్ మెడికల్ ప్రాక్టీషనర్ గా రిజిస్టర్ అయ్యి ఉండవలెను అని నోటిఫికేషన్ లో తెలిపారు.
వయసు :
18 నుండి 42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /బీసీ /EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 370 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 120 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ( CBT) ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఈ పరీక్షలో జనరల్ స్టడీస్ అంశాలకు 150 మార్కులు మరియు సంబంధిత సబ్జెక్టు అంశాలకు 300 మార్కులను కేటాయించి, మొత్తం సీబీటీ పరీక్షను 450 మార్కులకు నిర్వహించనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 37,100 రూపాయలు నుండి 91,450 రూపాయలు వరకూ జీతం అందనుంది.
APPSC నుంచి ఒకే సారి 7 నోటిఫికేషన్స్ రావడం జరిగింది. పూర్తి సమాచరం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
సహాయ దర్శకుడు --6
లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ (హోమియో) - 24
తెలుగు రిపోర్టర్ - 5
మెడికల్ ఆఫీసర్ (యునాని) - 26 పోస్టులు
మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) - 53 పోస్టులు
0 Comments