గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు చెందిన డాక్టర్ ఏ. పీ. జె. అబ్దుల్ కలామ్ మిస్సయిల్ కాంప్లెక్స్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబర్యాటరీ,
హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
మంచి స్థాయిలో స్టై ఫండ్స్ లభించే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఈ నోటిఫికెషన్ లో తెలిపారు. DRDO Hyderabad Update 2021 Telugu
DRDO విడుదల చేసిన ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టుల వివరాల గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది :
ప్రకటన వచ్చిన 15 రోజుల లోపు..
ఉద్యోగాలు - వివరాలు :
గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ - 30
టెక్నీషియన్ (డిప్లొమా ) అప్ప్రెంటీస్ - 11
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ :
డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ - 3
డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 3
డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 5
డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ - 16
డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ - 2
డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 1
టెక్నీషియన్ (డిప్లొమా ) అప్ప్రెంటీస్ :
డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ - 4
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 2
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 2
డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ - 1
డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 1
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా వివిధ విభాగాలలో మొత్తం 40 అప్ప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత విభాగాలలో 2018,2019 మరియు 2020 అకాడమిక్ ఇయర్స్ లో బీ. ఈ /బీ. టెక్ /డిప్లొమా /ఐటీఐ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
ఈ క్రింద తెలిపిన చిరునామాకు అభ్యర్థులు తమ తమ సెల్ఫ్ అటేస్టేడ్ బయో డేటా, మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్, ఆధార్ ఐడి కార్డు, రిజిస్ట్రేషన్ ప్రూఫ్ ఇన్ MHRDNATS, ఇ- మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తదితర వివరాలను నోటిఫికేషన్ వచ్చిన 15 రోజుల లోపు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎంపిక విధానం :
అకాడమిక్ మెరిట్ /వ్రాత పరీక్ష /ఇంటర్వ్యూ ల విధానం ఆధారంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అప్ప్రెంటీస్ షిప్ రూల్స్ ప్రకారం ఆసక్తికరమైన జీతములు లభించనున్నాయి.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా ఈ క్రింది వెబ్సైటు లో రిజిస్ట్రేషన్ కావలెను అని ఈ ప్రకటనలో ముఖ్యంగా పొందుపరిచారు.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ (చిరునామా ) :
Director,
Advanced Systems Laboratory, DRDO,
P. O. Kanchanbagh,
Hyderabad - 500058.
0 Comments