ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై భారీ రిక్రూట్మెంట్ కు సన్నద్ధం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్నా సుమారు 11,775 వైద్య పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అంగీకారం తెలపడం జరిగింది.
ఇప్పటికే ఈ 11,775 పోస్టుల భర్తీకి ఏపీ ఆర్థిక శాఖ ఆమోదం తెలుపగా, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాబోయే రెండు, మూడు రోజులలో అధికారికంగా ప్రకటించనుంది.
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలలో భర్తీ చేయనున్న ఈ భారీ ప్రభుత్వ ఉద్యోగాలు 11,775 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెల(అక్టోబర్ ) ఆఖరుకు ప్రకటించి, AP 11775 Jobs update Telugu
నవంబర్ 10వ తేది లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆరంభించనున్నట్లు తెలుస్తుంది.
ఆర్థిక శాఖ ఆమోదించిన ఈ 11,775 పోస్టులతో పాటు, ఏపీ లో కొత్త పీ.హెచ్.సీ లు నిర్మాణంలో ఉన్న ఈ సందర్భంలో మరో 3,176 పోస్టులను కూడా ఈ పోస్టులకు కలపనున్నారు.
దీనితో వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేయనున్న ఈ పోస్టుల సంఖ్య సుమారుగా 15,000 కు చేరుకొనున్నట్లు సమాచారం అందుతుంది.
0 Comments