ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కు చెందిన ఆరవ(6th) ఆంధ్రా బెటలియాన్ ఎన్.సీ.సీ(NCC) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.
2). డ్రైవర్ ఉద్యోగాలు కూడా కలవు.
3).ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
మంచి స్థాయిలో వేతనాలు లభించే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ గవర్నమెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి - విధానాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ఈ ఆర్టికల్ చదివిన వారు తప్పనిసరిగా షేర్ చెయ్యండి. ఈ సమాజానికి మేలు చేసిన వారు అవుతారు.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరడానికి చివరి తేది : నవంబర్ 30, 2021.
విభాగాల వారీగా ఖాళీలు :
సీనియర్ అసిస్టెంట్ - 2
జూనియర్ అసిస్టెంట్ - 2
డ్రైవర్ - 1
లాస్కర్ - 2
మొత్తం పోస్టులు :
మొత్తం 7 ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్ కోర్సులలో ఉత్తీర్ణత ను సాధించి, ఇంగ్లీష్ మరియు అకౌంట్స్, కంప్యూటర్ నాలెడ్జ్, తెలుగులో వ్రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు.
మరియు డ్రైవర్ ఉద్యోగానికి వాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి అనీ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
35 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో సంబంధిత వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, దరఖాస్తు ఫారం ను నింపవలెను.
దరఖాస్తు ఫారం ను నింపిన తరువాత సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింద ఇవ్వబడిన అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేది లోగా ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు ఫారం లను పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ల నిర్వహణ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
పోస్టుల కేటగిరీ లను అనుసరించి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతంగా 17,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :
Commanding Officer,
6th Andhra Battalion N.C.C,
Anantapuramu,
Andhra Pradesh.
0 Comments