డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్స్ లో ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 35,200 రూపాయలు వరకూ, వెంటనే అప్లై చేసుకోండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ కలిగిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్టనర్డ్ బ్యాంక్ అయిన డిస్ట్రిక్ట్ కో -ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB) ఆధ్వర్యంలో ఉన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల డీసీసీబీ బ్యాంకులలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్స్ మరియు స్టాఫ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్స్ తాజాగా విడుదల కావడం జరిగింది.
ముఖ్యంశాలు :
1). ఇవి ప్రభుత్వ పార్టనర్డ్ బ్యాంక్ ఉద్యోగాలు.
2). రెగ్యులర్ పద్దతిలో శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
3). లోకల్ జిల్లా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
4). స్థానిక భాష (తెలుగు ) వచ్చి ఉండవలెను.
మంచి స్థాయిలో వేతనాలు లభించే ఈ బ్యాంక్ ఉద్యోగాలకు అర్హతలు గల లోకల్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
దరఖాస్తు గడువు ముగిసిన 10-15 రోజుల లోపు పరీక్షను నిర్వహించనున్నారు. ప్రకటన విడుదలైన కేవలం రెండు నెలల లోపు ఈ ఉద్యోగాలను అభ్యర్థులకు కల్పించే అవకాశాలు ఉన్నాయి. AP Cooperative Central Bank Jobs
ఏపీ లో లోకల్ జిల్లాల అభ్యర్థులకు తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. DCCB లో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును సవివరంగా మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : నవంబర్ 19, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 3, 2021
ఆన్లైన్ టెస్ట్ నిర్వహణ తేది : డిసెంబర్ 2021
ఉద్యోగాలు - వివరాలు :
అసిస్టెంట్ మేనేజర్స్ - 41
స్టాఫ్ అసిస్టెంట్స్ - 117
జిల్లాల వారీగా ఉద్యోగాలు :
నెల్లూరు డిస్ట్రిక్ట్ కో -ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ :
అసిస్టెంట్ మేనేజర్స్ - 23
స్టాఫ్ అసిస్టెంట్స్ / క్లర్క్స్ - 42
అనంతపూర్ డిస్ట్రిక్ట్ కో - ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ :
అసిస్టెంట్ మేనేజర్స్ - 20
స్టాఫ్ అసిస్టెంట్స్ / క్లర్క్స్ - 66
కర్నూల్ డిస్ట్రిక్ట్ కో - ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ :
అసిస్టెంట్ మేనేజర్స్ - 8
స్టాఫ్ అసిస్టెంట్స్ / క్లర్క్స్ - 9
మొత్తం పోస్టులు :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు, అనంతపురం మరియు కర్నూల్ జిల్లాల డిస్ట్రిక్ట్ కో -ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్స్ లో మొత్తం 168 బ్యాంక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
అసిస్టెంట్ మేనేజర్స్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో కనీసం 60% లేదా 55% మార్కులతో గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేయవలెను.సంబంధిత సబ్జెక్టు విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అని ప్రకటనలో తెలిపారు.
స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్స్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేయవలెను.ఇంగ్లీష్ భాషలో నాలెడ్జ్ ను కలిగి ఉండి, స్థానిక భాష(తెలుగు) లో ప్రావీణ్యత కలిగి ఉండి, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండవలెను అని ఈ నోటిఫికేషన్ లో తెలిపారు.
వయసు :
కేటగిరీ లను అనుసరించి 45 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ )కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 590 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు 413 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష / ఇంటర్వ్యూ విధానాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 35,200 రూపాయలు వరకూ జీతం అందనుంది.
Nellore : Website
Ananthapuram Dist : Website 2
Kurnooldccb : Website 3
1 Comments
excellent good job Bro
ReplyDelete