ఇస్రో లో ఆఫీసర్స్ ఉద్యోగాలు, జీతం 1,12,400 రూపాయలు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్టుమెంటు ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) కి చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్,
బెంగళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
భారీ స్థాయిలో జీతం లభించనున్న ఈ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇస్రో కు సంబంధించిన సంస్థలో భర్తీ చేయబోతున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చునని ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : అక్టోబర్ 30, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : నవంబర్ 20, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్స్ - 6
అర్హతలు :
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లలో మాస్టర్ డిగ్రీ కోర్సులలో ఉత్తీర్ణత ను సాధించవలెను.
మరియు హిందీ నుండి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుండి హిందీ కు ట్రాన్స్ లేట్ చేయడంలో స్కిల్ ఉండవలెను అని ఈ నోటిఫికేషన్ లో తెలిపారు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
మిగిలిన కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 35,400 రూపాయలు నుండి 1,12,400 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments