ఇండియా గవర్నమెంట్ మింట్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు,ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, జీతం 95,910 రూపాయలు వరకూ
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న SPMCIL యూనిట్ కు చెందిన ఇండియా గవర్నమెంట్ మింట్, హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). భారీస్థాయిలో జీతములు.
ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
తాజాగా వచ్చిన ఈ హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకీ సంబంధించిన విధి - విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : నవంబర్ 29 , 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 27, 2021
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది : జనవరి / ఫిబ్రవరి 2022
ట్రేడ్ టెస్ట్ నిర్వహణ తేది : మార్చి / ఏప్రిల్ 2022
విభాగాల వారీగా ఖాళీలు :
సూపర్ వైజర్ - 4
లేబర్యాటరీ అసిస్టెంట్ - 8
ఎన్ గ్రావర్ - 3
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 15 సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల కేటగిరీ లను అనుసరించి,సంబంధిత విభాగాల సబ్జెక్టులలో బీ. ఈ /బీ. టెక్ /డిప్లొమా /బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ/ దివ్యంగుల కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలు ను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
ఆన్లైన్ టెస్ట్ తదుపరి ట్రేడ్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 23,910 రూపాయలు నుండి 95,910 రూపాయలు వరకూ జీతం అందనుంది.
APPSC ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు Clik Here
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
0 Comments