గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న నార్త్ సెంట్రల్ రైల్వే లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రైల్వే పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.
2). ఇంటర్మీడియట్ విద్యా అర్హతలతో కూడా ఉద్యోగాలు.
3). ఇవి రైల్వే గ్రూప్ "సీ" పోస్టులు.
4). గౌరవ స్థాయిలో ప్రారంభ జీతములు.
రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) నుండి తాజాగా విడుదల అయిన ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. Railway Jobs Recruitment 2021
ఈ పోస్టుల భర్తీకి ప్రకటనలో ఇచ్చిన విద్యా అర్హతలు, వయసు, దరఖాస్తు విధానం, ఉద్యోగ ఎంపిక విధానం తదితర అంశాలను గురించి మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది : నవంబర్ 26, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : డిసెంబర్ 25, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
అథ్లెటిక్స్ - 4
బాడ్మింటన్ - 1
బాక్సింగ్ - 1
క్రికెట్ - 3
జిమ్నాస్టిక్స్ - 1
హాకీ - 6
పవర్ లిఫ్టింగ్ - 1
టెన్నిస్ - 1
టేబుల్ టెన్నిస్ - 1
వెయిట్ లిఫ్టింగ్ - 2
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 21 రైల్వే పోస్టులను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ / ఐటీఐ కోర్స్ లను పూర్తి చేసి, సంబంధిత క్రీడా విభాగాలలో జాతీయ /అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొని, ప్రతిభను కనబర్చిన అభ్యర్థులు అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే స్పోర్ట్స్ కోటా పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలును మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
ట్రయిల్స్ అండ్ అభ్యర్థుల క్రీడా ప్రతిభల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 7th CPC ఆధారంగా ప్రారంభ జీతం 22,200 రూపాయలు వరకూ లభించనుంది.
APPSC ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు Clik Here
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
0 Comments