పరీక్ష లేదు, ఐటీఐ లిమిటెడ్, బెంగళూరు లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 72,717 రూపాయలు, వెంటనే అప్లై చేసుకోండి
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న డిపార్టుమెంటు ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ కు చెందిన ఐటీఐ లిమిటెడ్, బెంగళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
భారీ స్థాయిలో వేతనాలు లభించే ఈ ఒప్పంద ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులే అని ఈ నోటిఫికేషన్ లో తెలిపారు.
ఈ నోటిఫికేషన్ లో పొందుపరచబడిన ముఖ్యంశాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : నవంబర్ 11, 2021
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరడానికి చివరి తేది : నవంబర్ 15, 2021.
విభాగాల వారీగా ఖాళీలు :
AEE ( గ్రేడ్ 2 ) - 3
AEE ( గ్రేడ్ 2) - 9
డిప్యూటీ మేనేజర్ / మేనేజర్ (గ్రేడ్ 4/5) - 8
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా మొత్తం 20 కేంద్ర ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల సబ్జెక్టులలో 60% మార్కులతో బీ. ఈ /బీ. టెక్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ నోటిఫికేషన్ లో తెలుపుతున్నారు.
వయసు :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలకు మించరాదు అని ప్రకటనలో తెలుపుతున్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి ..?
ఆన్లైన్ విధానం లో మొదటిగా అభ్యర్థులు అప్లై చేసుకోవలెను.
తదుపరి ఆన్లైన్ అప్లికేషన్స్ ఫారం నకు సంబంధిత విద్యా అర్హతల సర్టిఫికెట్స్ ను జతపరిచి ఈ క్రింది చిరునామా (అడ్రస్ ) కు నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ఆధారంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 43,129 రూపాయలు నుండి 72,717 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ఈ జీతంతో పాటు ప్రొవిడెంట్ ఫండ్ (PF) + గ్రాట్యూటీ + మెడికల్ ఫెసిలిటీ + భోజన రాయితీ + ఇన్సూరెన్స్ + మేగ్ జైన్ అలోవెన్స్ లాంటి మంచి బెనిఫిట్స్ కూడా ఎంపికైన ఉద్యోగార్థులకు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
GENERAL MANAGER - HR,
ITI LIMITED, REGD&CORPORATE OFFICE,
ITI BHAVAN, DOORAVANI NAGAR,
BENGALURU - 560016.
Notification
0 Comments