ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ మెగా డీఎస్సీ పై కదలికలు మొదలైనట్లు తెలుస్తుంది.
ఏపీ రాష్ట్రంలో ఉన్నత మరియు ప్రాథమికొన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్యలను లెక్క తేల్చి చెప్పాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఉన్నత మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 3,4,5వ తరగతులు విలీనం కావడంతో కొత్తగా ఏర్పడిన ఉపాధ్యాయ ఖాళీలు
మరియు అవసరం అయ్యే తరగతుల గదుల వివరాలను రాబోయే సోమవారం లోగా నివేదికలను అందించాలని 13 జిల్లాల డీఈఓ లను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి గారు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
పై ప్రకటన ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని,ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే మెగా డీఎస్సీ గురించి ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ గా మనం చెప్పుకోవచ్చు.
పాఠశాలల్లో ఏర్పడిన ఖాళీల సంఖ్యలను తేల్చి సోమవారం నాటికీ నివేదిక సమర్పించాలని డీఈఓ లకు విద్యా శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణ కు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఏపీ లో ఇప్పటికే డీఎస్సీ నిర్వహణ కు ముందుగానే టెట్ నిర్వహణ కు సంబంధించిన సిలబస్ ను విడుదల చేశారు. ఈ తరుణంలో రాబోయే వారంలో ఉపాధ్యాయ ఖాళీలు పై అధికారిక సమాచారం అందుతుంది. కాబట్టి, దీనిని బట్టి చూస్తే, రాబోయే ఏడాది 2022 సంవత్సరంలో ఏపీ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానున్నట్లు మనకు తెలుస్తుంది.
మీకు తెలుసా మూడు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments