ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఏడాదిలో భర్తీ చేయబోయే గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాల భర్తీ విధి - విధానాలపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)ప్రణాళికలు రచిస్తున్నట్లుగా అధికారిక సమాచారం అందుతుంది.
ఇప్పటికే జిల్లాల నుండి విభాగాల వారీగా పోస్టుల ఖాళీలను సేకరించిన ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి కసరత్తులు చేస్తుంది.
మరో వైపు, గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో ప్రిలిమ్స్ పరీక్షలకు నిర్వహించాలా..? లేదా.. రద్దు చేయాలా..? అనే అంశంపై ఏపీపీఎస్సీ బోర్డు డైలామా లో పడినట్లు తెలుస్తుంది.
గ్రూప్స్ ఉద్యోగాల భర్తీపై ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులతో సమాలోచనలు చేసే విధంగా, ఇందుకు గానూ,
జనవరి, 2022 లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు (APPSC) ఏపీ లో నిరుద్యోగ అభ్యర్థులతో ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణ పై మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై ఒక కీలకమైన సమావేశం నిర్వహించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రిలిమ్స్ పరీక్షల అంశంపై క్లారిటీ రాగానే, ఏపీపీఎస్సీ నుండి వరుసగా గ్రూప్ 1,2 నోటిఫికేషన్స్ రానున్నట్లు కీలక సమాచారం అందుతుంది. APPSC Update 2022
ఇక ఈ నెలాఖరు లోపులోనే గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన 670 రెవెన్యూ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మరియు 60 దేవాదాయ ధర్మదాయ శాఖ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (గ్రేడ్ -3) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయని పలువురు అభ్యర్థులుకు ఏపీపీఎస్సీ హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా సమాచారం అందినట్లు మనకు తెలుస్తుంది.
ఏది ఏమైనా, రాబోయే ఏడాదిలో ఇటు ఏపీ లో అటు తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్స్ విడుదల కావడం ఖాయం గా కనిపిస్తున్న తరుణంలో అభ్యర్థులు మీ మీ ప్రిపరేషన్ ను మధ్యలో విడిచిపెట్టకుండా, కొనసాగించడం మంచిదిగా మనం చెప్పుకోవచ్చు.
మీరు ప్రతీ రోజు www.telugucompititive.com అనే మన వెబ్సైటు ద్వారా మీ మీ పరీక్షలకు ఉచితంగానే ప్రిపేర్ కావచ్చు.
Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments