ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ ఇన్ మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ /స్కేల్ -II ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ఈ ప్రకటన బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై నుండి ప్రకటించబడినది.
ముఖ్యంశాలు :
1). ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ గా అభ్యర్థులు చేసుకోవచ్చు.
2). పరీక్ష లేకుండానే పోస్టుల భర్తీ.
3). భారీ స్థాయిలో జీతములు.
ఎటువంటి ఎగ్జామ్స్ నిర్వహణ లేకుండా, భర్తీ చేసే ఈ బ్యాంక్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు అర్హులైన ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై నుండి వచ్చిన ఈ ఉద్యోగాల భర్తీ ప్రకటనలో పొందుపరిచిన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Bank of India Jobs Recruitment 2021 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : డిసెంబర్ 24, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 7, 2022
వయసు /అర్హతలు/ఎక్స్పీరియన్స్ లకు కటాఫ్ తేది : నవంబర్ 1, 2021.
ఉద్యోగాలు - వివరాలు :
సెక్యూరిటీ ఆఫీసర్స్ - 25
విభాగాల వారీగా ఖాళీలు :
SC - 2
ST - 2
OBC - 9
EWS - 1
GEN - 11
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 25 ఉద్యోగాలను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
25 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాలు వయసు వరకూ గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 850 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 175 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
పర్సనల్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్స్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 48,170 రూపాయలు నుండి 69,810 రూపాయలు వరకూ జీతం అందనుంది.
Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments