లోకల్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు, జీతం 35,000 రూపాయలు వరకూ, ఇపుడే మెయిల్ చేయండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో ఉన్న మినీ రత్న కంపెనీ అయిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). 8వ మరియు 10వ తరగతి విద్యా అర్హతలతో కూడా ఉద్యోగాలు.
3).లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
4). కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల భర్తీ జరగనుంది.
భారీ స్థాయిలో జీతములు లభించే ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు అని ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ,భీమవరం, నెల్లూరు, అమలాపురం, కాకినాడ, బాపట్ల, ఒంగోలు, మచిలీపట్నం నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
మరియు పై నగరాలతో పాటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కోల్ కత్తా, హరో, కంటై, మరియు గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్, వలసద్, మరియు తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టినం, పట్టుకొట్టాయి, ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్, బాలసూర్ మరియు కేరళ రాష్ట్రంలోని కొచ్చి లలో కూడా అభ్యర్థులకు పోస్టింగ్స్ ను ఇవ్వనున్నారు.
BECIL లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ ఈ - మెయిల్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 23, 2021.
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
ఎనాలిస్ట్ | 5 |
శాంపిల్ కలెక్టర్ | 2 |
ల్యాబ్ అటెండెంట్ | 0 |
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ | 1 |
కంటిజెంట్ డ్రైవర్ | 1 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 9 ఉద్యోగాలను తాజాగా ప్రకటించిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఖాళీల సంఖ్యలను అవసరమును బట్టి పెంచుతామని ఈ ప్రకటనలో స్పష్టంగా తెలియచేయడం జరిగింది.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 8వ / 10వ తరగతి / గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో ఎంఎస్సీ /బాచిలర్ డిగ్రీ /మాస్టర్స్ ఇన్ ఫిషరీస్ సైన్స్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను అని నోటిఫికేషన్ లో తెలిపారు.
డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులుకు LMV డ్రైవింగ్ లైసెన్స్ విత్ సౌండ్ బ్యాడ్జ్, సౌండ్ హెల్త్ /ఐ టెస్ట్ సర్టిఫికెట్, గుడ్ కండక్ట్ ఉండాలని, మరియు కొన్ని విభాగాల పోస్టులకు అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
21 సంవత్సరాలు నుండి 62 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
అప్లికేషన్స్ +సపోర్టివ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ + వ్రాత పరీక్ష + పర్సనల్ ఇంటర్వ్యూ ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఆఫ్ లైన్ /ఆన్లైన్ ఇంటర్వ్యూ లకు పిలువనున్నట్లు ఈ ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 13,000 రూపాయలు నుండి 35,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన ఈ - మెయిల్ అడ్రస్ :
hr.bengaluru@becil.com
వైజాగ్ లో ఉద్యోగాల భర్తీ Click Here
మెట్రో రైల్ లో జాబ్స్ Click Here
0 Comments