Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

BEL Recruitment 2021 Telugu : జీతం 50,000 ఇంజనీరింగ్ చదివిన వారికి హైదరబాద్ లో ఉద్యోగాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ యూనిట్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

పరీక్ష లేదు, బెల్ హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 50,000 రూపాయలు వరకూ, ఇపుడే అప్లై చేసుకోండి.

BEL Recruitment 2021 Telugu

ముఖ్యంశాలు   :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

2). భారీ స్థాయిలో జీతములు.

3). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.

4). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.

ఇంటర్వ్యూ ల విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును అని ఈ ప్రకటనలో తెలిపారు. BEL Recruitment 2021 Telugu

మచిలీపట్నం లో భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరడానికి చివరి తేది :  డిసెంబర్ 31, 2021.

విభాగాల వారీగా ఖాళీలు   :

పోస్ట్ లు ఖాళీలు
ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) 19
ట్రైనీ ఇంజనీర్స్ (మెకానికల్) 11
ట్రైనీ ఇంజనీర్స్ (కంప్యూటర్ సైన్స్ ) 3
ప్రాజెక్ట్ ఇంజనీర్స్ (ఎలక్ట్రానిక్స్ ) 36
ప్రాజెక్ట్ ఇంజనీర్స్ (మెకానికల్) 8
ప్రాజెక్ట్ ఇంజనీర్స్ (కంప్యూటర్ సైన్స్) 6
ప్రాజెక్ట్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్ ) 1

మొత్తం పోస్టులు  :

మొత్తం 84  సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులను తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి సంబంధిత విభాగాల సబ్జెక్టు లలో అనగా ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ /ఈ &టీ /టెలి కమ్యూనికేషన్ / మెకానికల్ /కంప్యూటర్ సైన్స్ /ఎలక్ట్రికల్ విభాగాలలో బీ. ఈ /బీ. టెక్ /బీ.ఎస్సీ ఇంజనీరింగ్  కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

25 నుండి 28 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

ఆన్లైన్ విధానంలో ఈ క్రింది వెబ్సైటు నుండి అప్లికేషన్స్ ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, తదుపరి దరఖాస్తు ఫారం ను నింపి, సంబందింత విద్య దృవీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింది చిరునామా కు నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు   :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 200 రూపాయలు మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 500 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ /దివ్యంగులు కేటగిరీ కి చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవల్సిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతల మార్కులు, అనుభవం, మరియు ఇంటర్వ్యూల విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతంగా 25,000 నుండి 50,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ జీతం తో పాటుగా 10,000 రూపాయలు వరకూ ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా (అడ్రస్ ):

Dy. General Manager (HR),

Bharat Electronics Limited,

I.E. Nacharam,

Hyderabad - 500076,

Telangana State.

Website

Notification

More jobs Hyderabad

Post a Comment

0 Comments