గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న ప్రిన్సిపాల్ డైరెక్టరేట్, డిఫెన్స్ ఎస్టేట్స్, సథరన్ కమాండ్, పూణే లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). మంచి స్థాయిలో వేతనాలు.
3). టైపింగ్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు.
గౌరవ వేతనాలు లభించే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పంపడానికి చివరి తేది : జనవరి 15, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్‌లు | ఖాళీలు |
---|---|
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | 7 |
సబ్ డివిజనల్ ఆఫీసర్స్ | 89 |
హిందీ టైపిస్ట్ | 1 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 97 సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
హిందీ ట్రాన్స్ లెటర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
సబ్ - డివిజనల్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రీక్యులేషన్ / సంబంధిత విభాగంలో డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
హిందీ టైపిస్ట్ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులకు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రీక్యూలేషన్ ను పూర్తి చేయవలెను,
మరియు హిందీ టైపింగ్ నిమిషానికి 25 పదములు తక్కువ కాకుండా స్పీడ్ టైపింగ్ వచ్చి ఉండవలెను అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 30 సంవత్సరాలు వరకూ ఉండవలెను.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ క్రింది వెబ్సైటు నుండి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, తదుపరి దరఖాస్తు ఫారం ను నింపి, సంబంధిత విద్య దృవికరణ పత్రాలను జతపరిచి ఈ క్రింద ఇవ్వబడిన చిరునామాకు నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
మహిళా /ఎస్టీ /ఎస్సీ /ఎక్స్ -సర్వీస్ మెన్ /EWS అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష / స్కిల్ టెస్టుల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 34,800 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రెస్ :
Principal Director,
Defence Estates,
Southern Command,
Near ECHS Polyclinic,
Kondhwa Road,
Pune
Maharashtra- 411040.
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments