ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 జిల్లాలలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది. పరీక్ష లేదు, జీతం 31,460 రూపాయలు.
ఏపీ మోడల్ స్కూల్స్ లో 282 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఇది ఒక అద్బుతమైన జాబ్ నోటిఫికేషన్ గా చెప్పడం జరుగుతుంది.
ముఖ్యంశాలు :
1). ఇవి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.
2).కాంట్రాక్టు పద్దతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
3). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల 12 జిల్లాల్లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఏపీ మోడల్ స్కూల్స్ లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల కు సంబంధించిన వివరాలు అన్నిటిని సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జనవరి 3, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 7, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) - 71
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) - 211
జోన్ల వారీగా ఖాళీలు :
జోన్ 1 - 50
జోన్ 2 - 4
జోన్ 3 - 73
జోన్ 4 - 155
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 282 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ /ఇన్స్టిట్యూట్ ల నుండి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ / రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ /మాస్టర్ డిగ్రీ / బీ. ఎడ్ /నాలుగేళ్ళ ఇంటిగ్రెటెడ్ డిగ్రీ కోర్స్ లను పూర్తి చేసి ఉండవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 44 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఆయా కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతల మార్కుల పెర్సెంటేజ్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 28,940 రూపాయలు నుండి 31,460 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments