గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్టుమెంటు ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్, గాంధీనగర్, గుజరాత్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1).ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2).టెంపరరీ విధానంలో భర్తీ చేయనున్నారు.
3). గౌరవ స్థాయిలో వేతనాలు.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు చెందిన ఉద్యోగాలకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో తెలిపారు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారంను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Library Trainee Jobs telugu 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదిలు :
ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్స్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 17, 2022.
లైబ్రరీ ట్రైనీ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 25, 2022.
ప్రాజెక్ట్ మెడికల్ ఆఫీసర్స్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 25, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
లైబ్రరీ ట్రైనీస్ - 4
కంప్యూటర్ అప్లికేషన్స్ - 4
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ - 18
ఎలక్ట్రానిక్స్ /ఈసీఈ&ఇన్స్ట్రుమెంటేషన్ - 10
ఇన్స్ట్రుమెంటేషన్ /ఇన్స్ట్రుమెంటేషన్&కంట్రోల్ - 5
మెకానికల్ - 28
ఫిజిక్స్ - 16
ప్రాజెక్ట్ మెడికల్ ఆఫీసర్స్ - 2
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 87 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ /డిప్లొమా/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ /ఎంబీబీఎస్ కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
కేటగిరీ లను అనుసరించి 40 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
అన్ని కేటగిరీల మహిళలు /ఎస్సీ /ఎస్టీ /దివ్యంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
వ్రాత పరీక్షలు (అవసరంను బట్టి ) / ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 20,000 రూపాయలు మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లు కూడా లభించనున్నాయి.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments