విజయవాడ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు, జీతం 81,100 రూపాయలు,ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే, వెంటనే అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ & ఎంప్లొయ్ మెంట్ ఆధ్వర్యంలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, విజయవాడ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). రెగ్యులర్ బేసిస్ లో, డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టుల భర్తీ.
3). 7th సీపీసీ ను అనుసరించి భారీ స్థాయిలో జీతములు.
ESIC లో భర్తీ చేయనున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఆసక్తి గల అర్హతలు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ ఈఎస్ఐసీ నుండి విడుదల అయిన ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 15, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) - 7
స్టేనో గ్రాఫర్ (స్టేనో) - 2
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 26
మొత్తం పోస్టులు :
మొత్తం 35 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హతలు కలిగి, కంప్యూటర్ నాలెడ్జి కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ అప్పర్ డివిజన్ క్లర్క్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ విద్యా అర్హతలు కలిగి ఉండి, ఇంగ్లీష్, హిందీ భాషల్లో కంప్యూటర్ టైపింగ్ స్కిల్ ఉన్న అభ్యర్థులు అందరూ స్టేనో గ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెట్రిక్యూలేషన్ ను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. AP UDC MTS Jobs Recruitment 2022
వయసు :
18 నుండి 27 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీ ల అభ్యర్థులు 250 రూపాయలను దరఖాస్తుఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
పరీక్షలు మరియు స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఈ పరీక్షలలో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కంప్రేహెన్షన్ తదితర అంశాలపై ప్రశ్నలను అడగనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 18,000 రూపాయలు నుండి 81,100 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments